నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలుగుచూసిన ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందుపై ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం, ఐసీఎంఆర్, ఆయూష్ అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇదో నాటు మందుగా ఏపీ ఆయుష్ శాఖ తెలిపింది. అయితే ఎటువంటి హానికరమైన పదార్థం కాదని స్పష్టతనిచ్చింది.
కేంద్రప్రభుత్వ ఐసీఎంఆర్, ఆయుష్ ఆయుర్వేద శాఖ పరిశీలన తర్వాత ఆనందయ్య మందుకు అనుమతి వస్తే టీటీడీ ఆధ్వర్యంలోని ఆయుర్వేద ఫార్మసీలోనే ఈ ఔషధం తయారు చేయిస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలిపారు.
తాజాగా చిత్తూరు జిల్లా నుంచి ఆయుర్వేద నిపుణులతో కలిసి ఎమ్మెల్యే చెవిరెడ్డి నెల్లూరు జిల్లా కృష్ణపట్నం వచ్చి ఆనందయ్య ఆయుర్వేద ఔషధాన్ని పరిశీలించారు. ఈ మందు ద్వారా కరోనా నివారణ అయితే ప్రజలందరికీ ప్రభుత్వం ద్వారా ఉత్పత్తి చేయించి పంచే ఏర్పాట్లు చేస్తామని చెవిరెడ్డి పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే దానిలో ఎలాంటి హానికర పదార్థాలు లేవని ఏపీ ఆయుష్ శాఖ తేల్చినందున.. ఐసీఎంఆర్, ఆయుష్ తుది నివేదిక కోసం చూస్తున్నామని.. దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్లుగా తయారు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెవిరెడ్డి వివరించారు. అనుమతి వస్తే టీటీడీ ఆయుర్వేద ఫార్మసీలోనే ఈ ఔషధం తయారు చేసి ప్రజలకు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే చెవిరెడ్డి తెలిపారు.