ఏపీలోని నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలుగుచూసిన ఆనందయ్య మందు ఎంతో మంది కరోనా బాధితులకు స్వాంతననిచ్చిన సంగతి తెలిసిందే. అది వేసుకున్న వారు కోలుకోవడంతో దీనికోసం డిమాండ్ మొదలైంది. ఇప్పటికే ఆనందయ్య మందుకు అనుమతి వచ్చింది. అయితే చుక్కల మందును మాత్రమే హైకోర్టు పెండింగ్ లో పెట్టింది. ఇప్పుడా మందుపై తాజాగా విచారణ చేపట్టింది.
ఆనందయ్య మందు పంపిణీ అంశంపై హైకోర్టు లో విచారణ గురువారం జరిగింది. కరోనా నివారణలో భాగంగా ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుల్లో కంటి చుక్కల మందుపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఈ విషయంపై గురువారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.
కంటి చుక్కల మందు విషయంలోనే ఏపీ ప్రభుత్వ ఆయుర్వేద విభాగం నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆనందయ్య తయారు చేసిన కంటి చుక్కల మందును 15 సంస్థలతో తనిఖీ చేయగా.. 'బాగా లేదు' అనే నివేదికలు వచ్చాయని ప్రభుత్వం తరుఫున న్యాయవాది తెలియజేశారు. దీనిపై వాదనలు వినిపించేందుకు సమయం ఇవ్వాలని ఆనందయ్య తరుఫు న్యాయవాది కోరారు.
మరోవైపు ఈ మందుపై కేంద్ర ప్రభుత్వం పరిశోధన చేయాలని పిటీషనర్లు కోరారు. దీంతో పిటీషన్ల వాదనలపై హైకోర్టు ధర్మాసనం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఆనందయ్య మందు కంటి చుక్కల మందు విషయంలో ఆయూష్ శాఖ కూడా సంతృప్తి చెందలేదని తెలిసింది. దాన్ని కంట్లో వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్ లకు గురయ్యే ప్రమాదం ఉందని.. అందుకే ఆపుతున్నట్టుగా తెలుస్తోంది.