ఏపీ సీఎం జగన్ కు ఆనందయ్య లేఖ

Update: 2021-06-08 08:30 GMT
నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో వెలుగుచూసిన కరోనా నివారణ ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య తాజాగా ఏపీ సీఎం జగన్ కు లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా మందు తయారీకి తన తాహతు సరిపోవడం లేదని.. ఏపీ ప్రభుత్వం తరుఫున సహకరించాలని ఆయన లేఖలో జగన్ ను కోరారు.

ఒక్కో జిల్లాకు 5వేల మందు ప్యాకెట్లు పంపేందుకు సిద్ధంగా ఉన్నామని.. ప్రభుత్వం ద్వారా పంపిణీ చేయించాలని ఆనందయ్య లేఖలో కోరారు.  అలాగే ఔషధం తయారీకి అవసరమైన సామగ్రి తదితరాలకు సహకారం అందించాలని వేడుకున్నారు.

కరోనా బాధితులకు విముక్తి కలిగిస్తున్న ఈ మందును ఎక్కువ మొత్తంలో తయారు చేసి ఇతర రాష్ట్రాలకు సైతం పంపిస్తామని ఆనందయ్య తెలిపారు. మందు తయారీకి విద్యుత్ సౌకర్యం ఉన్న కేంద్రం ఏర్పాటు చేయాలని ఆనందయ్య లేఖలో కోరారు. సోమవారం నుంచి ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు.

ఇక ఈరోజు ఆనందయ్య తన మందును నెల్లూరు జిల్లాలోని మనుబోలు, పొదలకూరు మండలాల్లో పంపిణీ చేశారు. గ్రామ వలంటీర్ల సహాయంతో ఆనందయ్య ఈ మందును ఇంటింటికి పంపిణీ చేయించారు.
Tags:    

Similar News