గ‌వ‌ర్న‌రే స‌ర్వం అంటున్న ఇరు రాష్ట్రాల మంత్రులు

Update: 2017-02-01 12:32 GMT
రెండు  తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలపై కీల‌కమైన ముంద‌డుగు ప‌డింది. - ఏ విషయం అయినా గవర్నర్ వాదం చర్చించుకోవాలి ఈ రోజు ఏకాభిప్రాయానికి వచ్చారు. ఏపీ త‌ర‌ఫున ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో స‌భ్యుడు - యనుమల రామకృష్ణుడు - తెలంగాణ రాష్ట్ర మంత్రులు హరీష్ రావు - జగదీష్ రెడ్డి హాజ‌రయ్యారు. ఈ సంద‌ర్భంగా వివిధ అంశాల‌పై చ‌ర్చించిన అంశాల‌ను రెండు రాష్ట్రాల మంత్రులు మీడియాకు వివ‌రించారు. -కోర్టులకు వెళ్లి సాగదీసుకునేకంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని అనుకున్నామ‌ని తెలిపారు. -రెండు రాష్ట్రాలకు సంబందించిన అన్ని అంశాలను ఇలా అవ‌గాహ‌న ద్వారానే పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నామ‌ని వారు తెలిపారు.

త‌మ‌వైపు నుంచి ఉన్న సమస్యలు ఏమిటనే జాబితాను గవర్నర్ కు రెండు మూడు రోజుల్లో అందిస్తామ‌ని య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు అన్నారు. ఇకపై జరిగి సమావేశాల్లో రెండు సమావేశాలైన అమరావతిలో జరపాలని గవర్నర్ ని కోరామ‌ని తెలిపారు. చాల సమస్యలు పెండింగులో ఉన్నాయని, ఏ విషయం అయినా గవర్నర్ వాదం చర్చించుకోవాలి ఈ రోజు ఏకాభిప్రాయానికి వచ్చామన వివ‌రించారు. రాజ్ భవన్ లో ఇరు రాష్ట్రాల మంత్రుల నేతృత్వంలోని గవర్నర్ నరసింహన్ భేటీ అవ‌డం మంచి సంప్ర‌దాయ‌మ‌ని య‌న‌మ‌ల అభిప్రాయ‌ప‌డ్డారు. మంత్రులు హరీష్ రావు - జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఫిబ్రవరి 9 న సాయంత్రం 4 గంటలకు మరోసారి భేటీ కావాలని నిర్ణ‌యించుకున్నామ‌ని వివ‌రించారు. విభజనకు సంబంధించి పెండింగ్ లోని అన్ని అంశాలను చర్చించామ‌ని అన్నారు. రెండు రోజుల్లో ఇరు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి సమస్యను ఎజెండా రూపంలో గవర్నర్ కార్యాలయానికి అందించాలని నిర్ణయించామ‌న్నారు. చర్చలు సామరస్య పూర్వక వాతావరణంలో జరగేందుకు అంగీకారం కుదిరిందని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News