అమిత్‌ షాపై ఏపీ బీజేపీ 'పంచె' తంత్రం

Update: 2016-11-19 06:46 GMT
బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను ఇంప్రెస్ చేయడానికి ఏపీ బీజేపీ నేతలు కొత్త  కొత్త ప్లాన్లు వేస్తున్నారు. ఈ నెల 26న పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బీజేపీ నిర్వహిస్తున్న రైతు సభను ఇందుకు వేదిక చేసుకోవాలనుకుంటున్నారు. సభను వినూత్నంగా నిర్వహించడానికి పార్టీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా పాల్గొనే ఈ సభకు హాజరయ్యే వారంతా పంచెలు ధరించి హాజరయ్యేలా చూడాలని పార్టీ నేతలు నిర్ణయించారు.

అమిత్ షా సభకు లక్ష మందిని సమీకరించాలన్నది నేతల ప్రణాళిక. తాజాగా తమ ప్రణాళికలో కొత్త మార్పులు చేశారు. ఆ లక్షమంది కూడా ప్యాంట్లు చొక్కాలతో కాకుండా పంచె కట్టుకుని వచ్చేలా చేయాలని ఏపీ బీజేపీ నేతలు అనుకుంటున్నారు.

రైతు సభగా నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగసభకు వచ్చేవారంతా పంచెలతో వస్తే సంప్రదాయబద్ధంగా ఉంటుందని పార్టీనేతల యోచనగావుంది. గతంలో రాజమహేంద్రవరంలో నిర్వహించిన అమిత్‌ షా బహిరంగ సభకు త్రివర్ణ చీరలు ధరించిన మహిళలు హైలైట్‌ గా నిలిచారని - మీడియాలో కూడా ఆ అంశానికి ప్రచారం బాగా వచ్చిందని, ఈ నేపథ్యంలోనే రైతు సభకు హాజరయ్యేవారంతా పంచెలు ధరించి వస్తే సరికొత్తగా ఉంటుందని పార్టీ నేతలు పేర్కొంటున్నట్టు సమాచారం. అంతా బాగానే ఉంది కానీ... నోట్ల రద్దుతో రగిలిపోతున్న జనం బీజేపీ సంబరాలు చేసుకుంటుండడం చూసి పంచెలూడదీసి కొడతారేమో జాగ్రత్త.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News