విజయవాడలో తొలిసారిగా భేటీ అయిన ఏపీ కేబినెట్ సమావేశం సుదీర్ఘంగా 8గంటల పాటు సాగింది. కేబినెట్ ప్రారంభంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంకు మంత్రివర్గం నివాళి అర్పించింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ప్రయత్నాలు కొనసాగించాలని ఏపీ కేబినెట్ లో నిర్ణయించారు. ఏపీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అని, దానికి కేంద్రం చేసిన ప్రకటనతో సంబంధం లేదని మంత్రివర్గం అభిప్రాయపడింది. ఇక రాష్ట్రంలో నూతనంగా 2లక్షల ఇళ్లు నిర్మించాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.5లక్షలు ఖర్చు చేయనున్నారు. విజయవాడలో తొలిసారిగా భేటీ అయిన ఏపీ కేబినెట్ సమావేశం సుమారు ఎనిమిదన్నర గంటలకు పైగా కొనసాగింది. ప్రత్యేక హోదా, ఫోన్ ట్యాపింగ్, ఇళ్ల నిర్మాణం, సీడ్ క్యాపిటల్ తో పాటు పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.
ఏపీ కేబినెట్ నిర్ణయాలు.....
- ప్రత్యేక హోదాపై ప్రయత్నాలు కొనసాగించాలని నిర్ణయం
- ఏపీలో 2లక్షల నూతన గృహాల నిర్మాణం
- ఒక్కో ఇంటికి రూ. 2.5లక్షలు ఖర్చు చేయాలని నిర్ణయం
- సంక్షేమ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయం
- ప్రభుత్వ శాఖలను త్వరగా అమరావతికి తరలించాలన్న సీఎం
- ఏఎన్‌యూలో అబ్దుల్ కలాం కాంస్య విగ్రహం ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం
- ఒంగోల్ లో ట్రిపుల్ ఐటీకి, మంగళగిరిలో ఎయిమ్స్ కూ కలాం పేరు పెట్టాలని కేబినెట్ యోచన
- అబ్దుల్ కలాం పేరిట విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
- రిషితేశ్వరి కుటుంబానికి రూ.10లక్షలు పరిహారం ఇవ్వాలని నిర్ణయం
- రిషితేశ్వరి కుటుంబానికి రాజమండ్రిలో 500 చ.గజాల స్థలం ఇచ్చేందుకు నిర్ణయం
- ఫోన్ ట్యాపింగ్ పై చట్టం తన పని తాను చేసుకుపోతుందని మంత్రులతో అన్న సీఎం
- నాలుగేళ్లలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయం
- రాజీవ్ స్వగృహ పథకం కింద 2,894 ఇళ్లు కట్టించాలని నిర్ణయం
-ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్రంలో విస్తృత ప్రచారం కల్పించాలని నిర్ణయం