ఏపీ కేబినెట్ భేటీ - హైలెట్స్‌

Update: 2015-08-29 12:48 GMT
ఏపీ కేబినెట్ స‌మావేశం ఈ రోజు విజ‌య‌వాడ‌లో సీఎం చంద్ర‌బాబు నాయుడు అధ్య‌క్ష‌త‌న జ‌రిగింది. ఈ కేబినెట్‌‌ లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అవినీతిపై కేబినెట్‌ లో చర్చ జరిగింది. తీర్పులపై హైకోర్టులో మాత్రమే సవాల్‌ చేసేలా నిబంధన ఉండాలని మంత్రులు సూచించారు.

కేబినెట్ భేటీ హైలెట్స్‌-తీర్మానాలు

- జ‌డ్పీ చైర్మ‌న్ జీతం 40 వేలకు, ఎంపీపీ, జ‌డ్పీటీసీల జీతం 6 వేల‌కు, ఎంపీటీసీలు, స‌ర్పంచ్‌ ల జీతం 3 వేల‌కు పెంపు..దీని వ‌ల్ల ప్ర‌భుత్వ ఖ‌జానాపై రూ.78 వేల కోట్ల భారం

- వాణిజ్య సంస్థ‌ల బోర్డుల‌ను తెలుగులోనే రాయాలి.

- శ్రీకాకుళం జిల్లా సోంపేట థ‌ర్మ‌ల్ ప‌వ‌ర్‌ ప్లాంట్ ర‌ద్దు.

- రాష్ర్టంలో వెట‌ర్న‌రీ, ఫిష‌రీస్‌, పాలిటెక్నిక్ క‌ళాశాల‌ల పెంపు

- టీటీడీ బోర్డు నుంచి తిరుప‌తి హుడా అధ్య‌క్షుడి తొల‌గింపు

- జీవో 1107 ర‌ద్దు

- ఇంట‌ర్ వ‌ర‌కు తెలుగును ద్వితీయ భాష‌గా త‌ప్ప‌నిస‌రిగా చ‌ద‌వాలి

- విజ‌య‌న‌గ‌రం జిల్లా గ‌రివిడిలో వెట‌ర్న‌రీ క‌ళాశాల ఏర్పాటు

- క‌ర్నూలులో పాలిటెక్నిక్ క‌ళాశాల ఏర్పాటు

- ఏపీని నాలెడ్జ్ సొసైటీగా మార్చ‌డం

- రాష్ట్ర ప్రభుత్వ జీవోలు, ఉత్తర ప్రత్యుత్తరాలు, తెలుగులోనే ఉండాలి.

-  ప్రైవేట్ వర్సిటీల అనుమతికి కొత్త విధానం

- సింహాచలం భూములను క్రమబద్ధీకరించ‌డం

- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన వివిధ సంస్థలకు భూములు కేటాయించ‌డం.
Tags:    

Similar News