ఏపీ కేబినెట్ సమావేశం కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఈ కేబినెట్ భేటిలో జగన్ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు తీసుకుంది. పరిపాలన వికేంద్రీకరించాలని.. కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని.. జోనల్ వ్యవస్థకు జగన్ కేబినెట్ నిర్ణయించింది.
అమరావతి సీఆర్డీఏ రద్దు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించింది. దీని స్థానంలో అమరావతి మెట్రోపాలిటన్ అథారిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. సీఆర్డీఏను రద్దు చేస్తూ...అమరావతి మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ గా మార్పుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఇక అమరావతిని రాజధానిగా కొనసాగిస్తూనే విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని నిర్ణయించారు. మూడు అసెంబ్లీ సమావేశాలు అమరావతి లోనే నిర్ణయించాలని జగన్ సర్కారు కేబినెట్ భేటిలో ఆమోదం తెలిపింది. ఇక కర్నూలు లో హైకోర్టు ఏర్పాటు చేయాలని జగన్ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది.
అమరావతి కోసం భూములు ఇచ్చి నష్టపోయిన రాజధాని రైతులు, కూలీలకు ఇచ్చే పింఛన్ ను 2500 నుంచి 5000కు పెంచడానికి జగన్ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది.
ఇక ఏపీ జిల్లాల సంఖ్యను పెంచాలని క్యాబినెట్ లో చర్చ జరిగింది. కలెక్టర్ ల వ్యవస్థ లో మార్పు చేయాలని చర్చించారు. త్వరలోనే జిల్లాల ఏర్పాటుతోపాటు 4 జిల్లాలకు కలిపి ఒక సూపర్ కలెక్టర్ ను ఏర్పాటు చేసే విషయం పై కేబినెట్ చర్చించినట్టు తెలిసింది.