ఏపీ ఉద్యోగులకు బాబు సర్కార్ బంపర్ ఆఫర్

Update: 2015-08-15 06:19 GMT
యుద్ధ ప్రాతిపదికన అన్న రీతిలో వెనువెంటనే ఏపీ రాజధానికి హైదరాబాద్ లోని ఏపీ ఉద్యోగులు తరలి రావాలన్న ఆదేశాన్ని ఏపీ సర్కారు చేయటం తెలిసిందే. ఎట్టి పరిస్థితుల్లోనూ రెండు నెలల్లో విజయవాడకు వచ్చేయాలని ఏపీ సర్కారు చెబుతున్న నేపథ్యంలో.. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు.

విజయవాడలో మౌలిక సదుపాయాలు లేకపోవటం.. ఉండేందుకు ఇళ్ల కొరత కూడా తీవ్రంగా ఉందన్న నేపథ్యంలో ఉద్యోగులు తమ విధి నిర్వహణపై బెంగ పెట్టుకున్నారు. దీనికి తోడు.. కుటుంబ సమస్యలు ఉండనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులకు ఏపీ సర్కారు బంపర్ ఆఫర్ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.

రాజధానికి తరలి వచ్చే ప్రభుత్వ ఉద్యోగులకు సొంతిళ్లు నిర్మించాలని ఏపీ సర్కారు డిసైడ్ చేసింది. రాజధానికి తరలి వచ్చే ఉద్యోగులకు సర్వీసు క్వార్టర్లు మాత్రమే కాకుండా.. ఉద్యోగులు బిల్డర్లకు ఎలాంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేకుండా..వాయిదాలు కట్టాల్సిన అవసరం లేకుండా.. ఆ ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించేలా ఒక పథకాన్ని రూపొందించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. కాకపోతే.. అన్ని ఆఫర్లకు మాదిరే దీనికి ఒక షరతు ఉంది. అదేమంటే.. ఉద్యోగులు తమ జీతంతో పాటు వచ్చే ఇంటి అలవెన్స్ ను వదులుకోవాల్సి ఉంటుంది. మరి.. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు ఎలా రియాక్ట్ అవుతారో..?
Tags:    

Similar News