నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణంలో మొదటి దశలో ప్రారంభించిన తాత్కాలిక సచివాలయం ప్రవేశానికి ముహూర్తం ఖరారైంది. మరో ఆరు నెలల పాటు సుముహూర్తం లేదని వేద పండితులు చెబుతుండటంతో ఈ నెల 25న తెల్లవారుజామున 4.01 గంటలకు ముహూర్తం ఖరారు చేశారు. దీంతో సచివాలయం మొదటి అంతస్తులో రెండు గదుల్లో యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని మంత్రి నారాయణ సీఆర్ డీఏ అధికారులను ఆదేశించారు.
ఈ మేరకు వేగంగా పనులు చేస్తున్న సంబంధిత కాంట్రాక్టర్లు నిర్దేశిత సమయం కల్లా ఏర్పాట్లు చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. తాత్కాలిక సచివాలయం పనులు వేగంగా పూర్తి చేసి ఈ ఏడాది జూన్ కల్లా నవ్యాంధ్రప్రదేశ్ నుంచి పూర్తి స్థాయి పరిపాలన కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్ఛయంగా ఉన్న సంగతి తెలిసిందే.