40రోజులకు పైగా లాక్ డౌన్. జనాలంతా కరోనా భయానికి ఇంట్లోనే ఉన్నారు. ఉద్యోగాలు.. ఉపాధి కోల్పోయి ఉన్న కాస్త డబ్బులతో తిండి తింటూ తిప్పలు పడుతున్నారు. కానీ ఇప్పుడా తిండికి కూడా ఖర్చు చేయకుండా ఉన్న కాసిన్ని డబ్బులతో మద్యం షాపుల వద్దకు పరిగెత్తారు. ఏపీలో తొలిరోజు మద్యం దుకాణాల వద్ద జాతర చూశాక.. ఎవ్వరికీ ఇంతటి క్లిష్ట సమయంలో డబ్బు కాపాడుకుందాం.. ఉన్న డబ్బును మద్యానికి తగిలేయవద్దు అన్న ప్రాథమిక సృహ లేకుండా పోయింది. ప్రభుత్వం 1500 వేసినా.. కొందరు విరాళాలతో ఇచ్చిన డబ్బునంతా మద్యానికే తగిలేస్తున్న పరిస్థితి దాపురించింది.
ఇక ఈ డబ్బులు స్వాహా సరిపోదన్నట్టు ఇప్పటికే మద్యం ధరలను పెంచిన ఏపీ సర్కార్ తాజాగా మరో 50శాతం పెంచడం అందరినీ షాక్ కు గురిచేస్తోంది. తద్వారా ఏపీలో మందుబాబులకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ షాక్ ఇచ్చినట్టైంది.
మే 4నే ఏపీ ప్రభుత్వం మద్యం ధరలను 25శాతం పెంచుతూ నిన్ననే నిర్ణయం తీసుకుంది. ఇవాళ మరోసారి మద్యం ధరలను 50శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో మొత్తం మద్యం ధరలు కేవలం రెండు రోజుల్లోనే 75శాతం పెరిగాయి. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. నిన్నటి డిమాండ్ ను దృష్టిలో ఉంచుకునే ప్రభుత్వం మద్యం ధరలను బాగా పెంచి కటకట వేళ ‘క్యాష్’ చేసుకునే ఎత్తుగడ వేసినట్టు అర్థమవుతోంది.
ఇప్పటికే నెలన్నర రోజులుగా పనిలేక ఉన్న కాసిన్ని డబ్బులతో ఉన్నది తింటూ ఇంట్లో ఉంటున్న పేదలు - కూలీలకు ఈ మద్యం షాపుల ఓపెనింగ్ - ధరల పెంపు శరాఘాతంగా మారింది. ఉన్న డబ్బులంతా తాగుడుకే తగలేస్తే ఇక ఆ కుటుంబాలు ఎలా బతుకుతాయాన్నది మేధావులు ప్రశ్నిస్తున్నారు. మద్యం షాపులు తెరవడమే తప్పు అంటే.. ఇప్పుడు ఏకంగా 75శాతం పెంచి పేదల డబ్బును పీల్చేయడం కరెక్టేనా అని ప్రశ్నిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఇవాళ ఉదయం మద్యం షాపులు తెరుచుకోలేదు. మద్యం అమ్మకాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉదయమే ఓ ప్రకటన విడుదల చేసింది.ఈ మేరకు ఎక్సైజ్ శాఖ నుంచి మంగళవారం నాడు ఉత్వర్వులు వెలువడ్డాయి. పెంచిన ధరలు ఇవాళ్టి నుంచే అమలు కానున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి షాపులు తెరుచుకోనున్నాయి. కాగా ఈ నెలాఖరులోగా 15శాతం మద్యం దుకాణాలను మూసేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. ఇవాళ ఉదయం మద్యం షాపులు తెరుచుకోలేదు. మద్యం అమ్మకాలను ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ఉదయమే ఓ ప్రకటన విడుదల చేసింది.