పదే పదే భూములిచ్చిన రైతుల మాట

Update: 2015-10-23 04:43 GMT
ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన సందర్భంగా ఒక విషయం ప్రస్ఫుటంగా కనిపించింది. శంకుస్థాపన కార్యక్రమంలో అత్యంత కీలకమైన రైతుల అంశంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ఏపీ రాజధానికి భూములు ఇచ్చిన రైతులు పెద్ద ఎత్తున శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావటం తెలిసిందే.

అమరావతి శంకుస్థాపన సందర్భంగా అవకాశం ఉన్న ప్రతిసారీ రైతుల త్యాగాల గురించి.. ఏపీ రాష్ట్ర రాజధాని కోసం రైతులు ప్రదర్శించిన చొరవ గురించి ప్రత్యేకంగా చెప్పుకొచ్చారు. శంకుస్థాపన కార్యక్రమం ఇంత భారీగా జరుగుతుందంటే.. భూసమీకరణకు సానుకూలంగా స్పందించిన తమ భూముల్ని వెనకా ముందు చూసుకోకుండా.. ఏపీ సర్కారు మీదున్న నమ్మకంగా ఇంత భారీ భూమిని ఇచ్చారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. పొగడ్తలతో మాత్రమే కాకుండా చేతల్లో కూడా భూములు ఇచ్చిన రైతులను పేరు పేరునా ప్రస్తావిస్తూ వారిని ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేశారని చెప్పక తప్పదు.

నేతల మాటల్లోనే కాదు.. శంకుస్థాపన కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన సాయికుమార్.. సునీతలు సైతం రైతుల ప్రస్తావనను పదే పదే తీసుకొచ్చారు. అంతేకాదు.. కళాకారులు సైతం తమ నృత్య ప్రదర్శనల సందర్భంగా రైతుల త్యాగాలను ప్రత్యేకంగా ప్రస్తావించటం గమనార్హం. ఇవే కాదు.. వేల వేల దండాలు మా రైతన్న అంటూ ప్రదర్శించిన డ్యాన్స్ అందరిని ఆకట్టుకునేలా చేసింది. రైతుల త్యాగాల్ని తెలియజేస్తూ.. ప్రతి రైతుకు పాదాభివందనం అంటూ ఆలపించిన గీతానికి రైతుల నుంచి విశేష స్పందన లభించింది.

ఇక.. శంకుస్థాపన కార్యక్రమం ఇంత ఘనంగా జరిగిందంటే.. దీనికి వెనుక ఒకరున్నారు. అమరావతి రాజధానిగా ప్రకటించిన వెంటనే.. తనకున్న భూమిని ఇచ్చేందుకు సిద్ధం కావటమే కాదు.. ఆ దిశగా అడుగులు వేసి వేలాది మంది రైతులకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పకతప్పదు. అందుకే.. ఇంత పెద్ద కార్యక్రమంలోమొదట భూమి ఇచ్చిన మహిళా రైతు ఆదిలక్ష్మి పేరును ప్రస్తావించటమే కాదు.. రాజధాని కోసం తమ భూముల్ని ఇచ్చిన 29 గ్రామాల పేర్లను ప్రస్తావిచంటం ఒక విశేషమైతే.. రైతుల ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ ఆహుతులంతా ఆనందంతో కేరింతలు కొట్టటం కనిపించింది.

 
Tags:    

Similar News