ఏపీ ఎంత దయనీయంగా ఉందన్న విషయం కొన్ని గణాంకాలు చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఏపీని కానీ కేంద్రం పెద్దఎత్తున ఆదుకోకుంటే ఏపీ అప్పుల కుప్పలా మారిపోవటం ఖాయమని చెబుతున్నారు. ఏపీ ప్రగతి రథాన్ని పరుగులు పెట్టిస్తున్నట్లు చెబుతున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు.. గణాంకాలకు మధ్య పొత్తు అస్సలు కుదరటం లేదన్న వాదన వినిపిస్తోంది. విభజన అనంతరం ఏపీకి ముఖ్యమంత్రిగా అయిన చంద్రబాబు తన 26 నెలల పాలనలో చేసిన అప్పుల గురించి తెలిస్తే షాక్ కు గురి కావాల్సిందే. అప్పుల మీద అప్పులు చేసుకుంటూ పోతున్న వైనం విస్మయానికి గురి చేయటమే కాదు.. ఇలానే ముందుకెళితే రానున్న రోజుల్లో ఏపీ పరిస్థితి ఏమవుతుందన్నది ఆలోచించటానికే భయపడే పరిస్థితి.
కిందామీదా పడి బండి లాగుతున్నట్లు కనిపించినా.. ఏపీ సర్కారు నడుస్తోందంతా అప్పుల మీదనే అన్నది చేదు నిజం. మరింత ఆందోళన కలిగించే అంశం ఏమిటంటే.. ఈ అప్పుల్లో చాలావరకూ గతంలో చేసిన అప్పుల మీద వడ్డీ తీర్చటానికే సరిపోతుందట. ఈ ఏడాది ఇప్పటివరకూ రూ.18,796 కోట్లు అప్పు చేస్తే ఇందులో రూ.12,661 కోట్లు వడ్డీ చెల్లింపులకే సరిపోతుందని చెబుతున్నారు. చేసిన అప్పులో కేవలం ఒక వంతు కంటేకాస్త ఎక్కువగా (,రూ.6135కోట్లు) సంక్షేమ కార్యక్రమాలకు వినియోగిస్తే.. కొత్త అప్పులో మూడు వంతుకు కాస్త తక్కువగా (రూ.12,661కోట్లు) పాత అప్పుల మీద వడ్డీకి చెల్లించటానికి సరిపోతే ఇక అప్పులు తీర్చేదెప్పుడు? అన్నది పెద్ద సందేహం.
ఇదిలా ఉంటే.. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి కోసం భారీగా పెద్ద ఎత్తున రుణాలు తీసుకొచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో.. అప్పుల మీద వడ్డీల చెల్లింపునకు అప్పుకు మించి మరో మార్గం లేదన్న వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో రానున్న రెండు.. మూడేళ్లలో ఏపీ అప్పు తక్కువలో తక్కువ రూ.3లక్షల కోట్లకు చేరుకున్నా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అన్నిలక్షల కోట్ల అప్పు చేసే దుస్థితికి ఏపీ ఎలా చేరుకుంటుందన్న సందేహం పలువురికి కలగొచ్చు. గడిచిన 26 నెలల్ని చూస్తే.. భవిష్యత్ ఎంత దారుణంగా ఉంటుందో ఇట్టే అర్థమవుతుంది. విభజన నాటికి ఉమ్మడి రాష్ట్ర అప్పు రూ.1.80లక్షల కోట్లు అయితే.. విభజన జరిగిన ఈ స్వల్ప వ్యవధిలో ఏపీ రాష్ట్రం ఒక్క అప్పే రూ.1.79లక్షల కోట్లకు చేరుకోవటం చూస్తే.. రానున్న మూడేళ్ల వ్యవధిలో పరిస్థితి మరెంత దారుణంగా మారుతుందన్న ఇట్టే అర్థం కాక మానదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏపీ సర్కారు రూ.20,675 కోట్లు చేసే అవకాశం ఉందని.. అందులో రూ.15,985 కోట్లు అప్పు మీద వడ్డీ చెల్లించటానికే సరిపోతుందన్న అంచనా వ్యక్తమవుతోంది. ఇది ప్రమాదకరమైన ప్రయాణంగా చెబుతున్నారు. ఏపీపై అప్పుల భారం రోజు గడిచే సరికి ఎక్కువ అవుతుందని.. దీనికి సరిగా చెక్ పెట్టకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆందోళనకరస్థాయికి దిగజారటం ఖాయమంటున్నారు.
ఇప్పుడున్న పరిస్థితే కొనసాగితే.. 2021 నాటి దేశంలో అభివృద్ధి చెందిన మొదటి మూడు రాష్ట్రాల్లో ఏపీ ఉంటుందో ఉండదోకానీ.. అప్పుల్లో మాత్రం టాప్ త్రీలో ఒకటి కావటం ఖాయమని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాలకులు వస్తుంటారు.. పోతుంటారు. కానీ.. ఆయా పాలకులు చేసే అప్పులే చివరకు ప్రజల మెడకు చుట్టుకుంటాయన్న విషయాన్ని మర్చిపోకూడదు. బాబు చెప్పే అభివృద్ధితో పాటు.. బాబు చేస్తున్న అప్పు మీద కానీ దృష్టి పెట్టకపోతే ఏపీ పుట్టె మునిగిపోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.