ఏపీలో రాజకీయాలు గత కొన్ని రోజులుగా రసవత్తరంగా మారుతున్నాయి. ఏక్షణమైనా భారీ కుదుపు జరగొచ్చన్న వార్తలు కొంచెం గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో వలసల రాజకీయం మొదలైంది. ఎవరు ఏ పార్టీలో చేరుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. అలాగే. పలువురు నేతలు చేస్తున్న కామెంట్స్ ఏపీ పాలిటిక్స్‌ని మరింత వేడెక్కిస్తున్నాయి. ఇప్పటికే దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో పాగా వేసిన కమలనాథులు.. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా తమ సత్తా చాటాలని చూస్తున్నారు. ప్రస్తుతం బీజేపీ టార్గెట్ తెలుగు రాష్ట్రాలే అని తెలుస్తోంది. ఓ వైపు తెలంగాణపై దృష్టి పెడుతూనే... మరోవైపు ఏపీలో కూడా పార్టీని బలోపేతం చేయాలనీ చూస్తున్నారు. దీనికోసం ముందుగా ఏపీలో ప్రతిపక్షం అయిన టీడీపీ ని ఖాళీ చేయబోతున్నట్టు సమాచారం.
ఇప్పటికే టీడీపీ కి చెందిన కొందరు ఎంపీలు బీజేపీ గూటికి చేరిపోయారు. దీనితో పార్టీలో మిగిలిన సీనియర్లని - ఎమ్మెల్యేలను ఆకర్షించే పని మొదలుపెట్టారు. ఈ పనిని దుబాయ్ వేదికగా ప్రారంభించినట్టు తెలుస్తుంది. ఏపీ రాజకీయాలు .దుబాయ్ లో బేరాలు ఎలా జరిగాయి అని ఆలోచిస్తున్నారా ..ఇటీవలే ఏపీ ఎంపీ సీఎం రమేష్ తనయుడి నిశ్చితార్థం వేడుకని సీఎం రమేష్ దుబాయ్ లో చాలా అట్టహాసంగా చేసిన విషయం తెలిసిందే. కేవలం ఈ నిశ్చితార్థం కోసమే 25 కోట్ల రూపాయల వరకు సీఎం రమేష్ ఖర్చు చేసారు. అలాగే ప్రత్యేకంగా ..15 స్పెషల్ ఫ్లైట్లు పెట్టి మరీ గెస్ట్ లని దుబాయ్ తీసుకుపోయారు. ఈ నిశ్చితార్థం వేడుకే .. రాజకీయాలకు వేదికగా మారిందని పలువురు తమ అభిప్రాయాలని వ్యక్తం చేస్తున్నారు.
ఈ వేడుకకి అన్ని పార్టీ ల నుండి సుమారుగా 700 మంది గెస్ట్ లు హాజరైయ్యారు. వీరిలో వైసీపీ - టీడీపీ - బీజేపీకి చెందిన ఎంపీలు - ఎమ్మెల్యే లు కూడా ఉన్నారు. వీరంతా ఒకే చోట చేరడంతో ఆ వేడుకకి రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం టీడీపీలో 23మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.వీరిలో దాదాపుగా 11మంది టీడీపీ ఎమ్మెల్యేలు దుబాయ్ లో బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారని తెలుస్తోంది. ఇకపోతే గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే గంటా బీజేపీలోకి వెళ్తారు అనే వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. గంటా తో పాటుగా మరో పదిమంది వరకు బీజేపీ నేతలకి టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే వైసీపీ ఎంపీలు సైతం ఢిల్లీ బీజేపీ పెద్దలతో మంతనాలు చేస్తున్నారు. దీనితో త్వరలోనే ఏపీ రాజకీయాలతో పాటు... టీడీపీలో భారీ కుదుపు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి ఏపీ రాజకీయాలలో ఎలాంటి కుదుపు ఉండబోతుందో తెలియాలంటే ఇంకొన్నిరోజులు వేచి చూడాలి. ఏదేమైనా కోట్లు ఖర్చుపెట్టి సీఎం రమేష్ తన కొడుకు నిచ్చితార్థం వేడుకని దుబాయ్ లో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తే ..అదే వేడుకని రాజకీయంగా బేరసారాలు ఆడేందుకు ఉపయోగించుకున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
- VS Rao