బడ్జెట్ తో పాటు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టే సరికొత్త విధానానికి తెర తీశారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. తమ ప్రభుత్వ వ్యవసాయానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందన్న విషయాన్ని చాటి చెప్పేందుకు వీలుగా.. 2014 సార్వత్రిక ఎన్నికల అనంతరం అధికారంలో వచ్చిన నాటి నుంచి ప్రతి ఏటా వ్యవసాయ బడ్జెట్ ను ఏపీ అసెంబ్లీలో ప్రవేశ పెడుతున్నారు.
అమరావతిలో నిర్మించిన అసెంబ్లీ భవనంలో తొలిసారి జరుగుతున్న బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టటంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు పత్తిపాటి. తమది రైతు రక్షణ ప్రభుత్వంగా చెప్పుకున్న ఆయన.. వ్యవసాయ రంగానికి.. రైతులకు తమ ప్రభుత్వం చేస్తున్న పనుల గురించి వివరంగా చెప్పుకొచ్చారు. దేశంలోనే తొలిసారి బయోమెట్రిక్ విధానం ద్వారా రైతులకు విత్తనాల్ని పంపిణీ చేస్తున్నట్లు చెప్పిన ఆయన.. వ్యవసాయదారుల ప్రయోజనాల్ని కాపాడేందుకు కొత్త విత్తన చట్టం తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు.
= వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ. 9,091 కోట్లు
= రైతులకు విద్యుత్ సబ్సిడీ రూ. 3300 కోట్లు
= సమగ్ర సాగునీటి, వ్యవసాయ రూపాంతీకరణకు రూ. 1600 కోట్లు
= పండ్ల తోటల పెంపకానికి రూ. 1015 కోట్లు
= ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయానికి రూ. 308 కోట్లు
= సూక్ష్మ సేద్యానికి రూ. 200 కోట్లు
= సహకార రంగానికి రూ. 174 కోట్లు
= వడ్డీ లేని రుణాలకు రూ. 172 కోట్లు
= వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 147
= ఆయిల్ ఫామ్ విస్తరణకు రూ. 55 కోట్లు
= సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయానికి రూ. 25 కోట్లు
= రైతుబంధు పథకానికి రూ. 18 కోట్లు
= పొలం పిలుస్తోంది కార్యక్రమానికి, చంద్రన్న రైతు క్షేత్రాల విస్తరణకు రూ. 17 కోట్లు
= సుస్థిర దిగుబడి, నీటి సంరక్షణకు రూ.10 కోట్లు
= పావలా వడ్డీకి రూ. 5 కోట్లు
ఏపీకి వ్యవ"సాయం" ఎంతంటే..
= మొక్కజొన్న.. మినుముల ఉత్పత్తిలో దేశంలో మొదటి స్థానం
= బొప్పాయి ఉత్పత్తిలో దేశంలో అగ్ర స్థానం
= మామిడి, టమాటా ఉత్పత్తిలో రెండో స్థానం
= చేపల, రొయ్యల ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానం
= మాంసం ఉత్పత్తిలో దేశంలో నాలుగో స్థానం
= పాల ఉత్పత్తిలో దేశంలో ఐదో స్థానం
ఏమేం చేశామంటే..
= ఉద్యాన పంటల నాణ్యత పెంచేందుకు కార్పొరేట్ సంస్థలతో ఒప్పందం
= నదుల అనుసంధానం ద్వారా పది లక్షల ఎకరాలకు నీరు
= 50 నుంచి 75 శాతం రాయితీతో వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు పంపిణీ
ఏం చేయనున్నామంటే..
= కొత్తన విత్తన చట్టానికి రూపకల్పన
= కర్నూలు జిల్లాలో మెగా సీడ్ పార్కు ఏర్పాటుకు ప్రయత్నాలు
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/