ప్రభుత్వం పట్టుదలకు పోతే జరిగేది ఏంటో ఒక్క జనవరి నెల జీతల చెల్లింపులోనే బయటపడిపోయింది. అదెలా అంటే ఒక వైపు ట్రెజరీ విభాగం మేము కొత్త పే రివిజన్ ప్రకారం జీతాలు లెక్క వేయమని భీష్మించుకున్న కూర్చున్న వేళ మొండిగా సర్కార్ వారికి ఆదేశాలు జారీ చేసింది. కఠినమైన ఆంక్షలు పెట్టింది. ఎలాగైనా కొత్త పే స్లిప్స్ తో జీతాలు ఇవ్వాల్సిందే అని హుకుం జారీ చేసింది.
దాని ఫలితం ఏంటి అంటే అన్నీ తప్పుల తడకలే, అంతటా పొరపాట్లే. దీని ఫలితంగా ఇంక్రిమెంట్లు కలవాల్సిన ఉద్యోగులకు వాటిలో కలపలేదు, చనిపోయిన పదవీ విరమణ చేసిన వారికీ జీతాలు ఇచ్చేశారు, ఇంకా విడ్డూరం ఏంటి అంటే కొన్ని కారణాల వల్ల పనిష్ మెంట్ కి గురి అయి సస్పెండ్ అయిన వారికి కూడా యమ దర్జాగా జీతాలు చెల్లించేశారు.
ఇలా ఆర్ధిక శాఖ చిత్రాలు ఎన్నో ఇక్కడ కనిపించాని ఉద్యోగులు బావురుమంటున్నారు. మీకు కొత్త పే స్లిప్ల్స్ ప్రకారమే జీతాలు ఇచ్చామని ఆర్ధిక శాఖ అధికారులు గొప్పలు చెప్పుకున్నారు, కానీ అందులో ఎన్ని తప్పులు దొర్లాయో మాత్రం వారు తాపీగా గుర్తించి ఇపుడు నాలుక కరచుకుంటున్నారు.
ఇక చనిపోయిన పెన్షనర్లకు పించన్లు ఇవ్వడం అంటే అది ఎలా జరిగిందో అధికారులకే అర్ధం కావాలి. అలాగే సస్పెండ్ అయిన వారు హ్యాపీగా జీతాలు అందేసుకున్నారు. ఇంకో వైపు చూస్తే ఇంక్రిమెంట్లు రావాల్సిన వారికి అవి ఎక్కడా జమ కాకుండా చేశారు. దాంతో వారు గగ్గోలు పెడుతున్నారు. నిజానికి ఇంక్రిమెంట్లు ఏ నెలలో జాబ్ లో చేరితే ఆ నెలలో కలుస్తాయి.
మరికొందరి ఉద్యోగుల విషయంలో చూసుకుంటే జీ ఎస్ ఎల్ ఐ, జీ పీ ఎఫ్ రుణాలు తీసుకున్న వారున్నారు. ఆలా చాలా మంది రుణాలు చెల్లించినా కూడా అది పట్టించుకోకుండా వారి జీతంలో కోత కోసేశారు. ఇక సెలవులో ఉన్న ఉద్యోగులకు జీతం డిసెంబర్ లో జమ కాలేదు, కానీ జనవరి నాటికి రావాలి. అయితే వారు ఇంకా సెలవులోనే అనుకుని జీతాలు ఆపేశారుట.
ఇక ఆదాయపు పన్ను చెల్లింపు విషయంలో చూసుకుంటే అది ఉద్యోగుల ఇష్టం బట్టి ఉంటుంది. కొందరు డిసెంబర్ నెలలో ఆదాయపు పన్నులో కోత పెట్టుకోలేదు, వారికి ఇపుడు కూడా పన్ను మినహాయింపు చేయకపోవడంతో వచ్చే నెల పెద్ద మొత్తంలో పన్ను కోత పడుతుందని లబోదిబోమంటున్నారు.
ఇక్కడ చిత్రమేంటి అంతే ఇంత ఆదరాబాదరాగా చేసినా కూడా చాలా మందికి ఇంకా జీతాలు అందలేదు, వారు చకోరపక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ఈ తతంగమంతా ఆర్ధిక శాఖ దృష్టిలోకి వెళ్ళడంతో ఇపుడు తప్పులు సరిదిద్దే పనిలో పడిందంట. ఎక్కువ ఇచ్చేసిన చోట రికవరీ చేయాల్సి ఉందని అంటున్నారు. మరి చనిపోయిన వారికి పెన్షన్లు అంటే అది కచ్చితంగా వెనక్కు తీసుకోవాలి. దాంతో ఇది కొత్త రకం తలనొప్పిగా మారుతోంది అని ఒక పనిని రెండు సార్లు అని ట్రెజరీ సిబ్బంది బావురుమంటున్నారు అంటే ఈ తొందరపాటూ పొరపాటు ఎవరికి అన్న ప్రశ్న అయితే కచ్చితంగా వస్తుంది.