మున్సిపల్ ఎన్నికల్లోనూ వైసీపీ హవా ...మూడు కార్పొరేషన్లు, ఆ మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ !
ఏపీలో మున్సిపల్ ఎన్నికల వేడి , పోలింగ్ సమయం దగ్గర పడేకొద్ది పెరిగిపోతుంది. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలపై విపక్షాలు , ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. మంగళ, బుధవారాల్లో ఏకంగా 7,263 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం 12 నగరపాలక, 75 పురపాలక, నగర పంచాయతీల ఎన్నికల బరిలో 8,787 మంది నిలిచారు. బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు ఎన్నికల సంఘం ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉంది.
బుధవారం నామినేషన్ల ఉపసంహరణ కావడంతో కొన్ని మున్సిపాలిటీలు క్లీన్ స్వీప్ కాగా, కార్పొరేషన్లను కూడా కైవసం చేసుకుంది. కడప జిల్లా పులివెందుల, చిత్తూరు జిల్లా పుంగనూరు, గుంటూరు జిల్లా మాచర్ల, పిడుగురాళ్ల మున్సిపాలిటీలు అధికార పార్టీ ఖాతాలో చేరాయి. వైసీపీ అభ్యర్థులు సింగిల్ నామినేషన్లు వేశారు. బుధవారం ముగిసిన ఉపసంహరణల ప్రక్రియ అనంతరం మొత్తం 578 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అందులో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు 570 చోట్ల టీడీపీ అభ్యర్థులు ఆరు స్థానాల్లో, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో చోట ఏకగ్రీవమయ్యారు.
చిత్తూరు, తిరుపతి, కడప కార్పొరేషన్లలో వైఎస్సార్ సీపీ ఆధిఖ్యం కొనసాగుతోంది. చిత్తూరులో 50 డివిజన్లకు గానూ 37, కడపలో 50 డివిజన్లకు గానూ 23, తిరుపతిలో 50 డివిజన్లకు గానూ 21 ఏక్రగీవాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో పడ్డాయి. ఇక కడప జిల్లా పులివెందుల 31 మున్సిపాలిటీలో అన్ని వార్డులను వైఎస్సార్ సీపీ ఏకగ్రీవంగా గెలుచుకుంది. రాయచోటిలో 34 వార్డులకు గాను 31, నాయుడుపేటలో 25 వార్డులకు గాను 23, కర్నూలు జిల్లా డోన్‌లో 32 వార్డులకు గాను 22, ఆత్మకూరు లో 24 వార్డులకు గాను 18, కొవ్వూరులో 23 వార్డులకు గాను 13, తునిలో 30 వార్డులకు గాను 15 వార్డులు వైఎస్సార్ సీపీకి ఏకగ్రీవం అయ్యాయి. సూళ్లూరుపేటలో 25 వార్డులకు గాను 15 వార్డుల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా విజయం సాధించారు. వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల నగర పంచాయతీలో 20 వార్డులకు గాను 12 వార్డులను వైఎస్సార్ సీపీ ఏకగ్రీవంగా దక్కించుకుంది. మిగిలిన జిల్లాల్లో కొన్ని వార్డులు, డివిజన్లు అధికార పార్టీ ఏకగ్రీవం చేసుకుంది.