ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి పెద్దగా వార్తల్లోకి రారు. వచ్చినా హెరిటేజ్ కు సంబంధించిన వ్యవహారాల్లోనో.. లేదంటే కుటుంబ వ్యవహారాలకు సంబంధించి అంశం విషయాల్లోనే ఆమె పేరు వార్తల్లో వినిపిస్తుంటుంది. అయితే.. అందుకు భిన్నంగా ఆమె వార్తల్లోకి వచ్చారు.
ఇటీవల న్యూఇయర్ వేడుకలకు హాజరైన భువనేశ్వరికి అఖిల భారత సర్వీసు అధికారులు ఆమెకు ఊహించని రీతిలో ఒక విన్నపాన్ని చేశారట. హైదరాబాద్ లో ఉంటున్న ఆమె.. అమరావతిలో ఉండే చంద్రబాబు కోసం ఆదివారాలు వస్తున్నారు. దీంతో.. చంద్రబాబు ఆ ఒక్కరోజు అధికారుల సమావేశాలకు దూరంగా ఉంటున్నారు.
ఈ నేపథ్యంలో భువనేశ్వరి మేడమ్ దృష్టికి ఉన్నతాధికారులు సరదాగా ఒక విన్నపాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఆదివారం విశ్రాంతి అన్న ఉద్దేశంతో సార్.. శనివారం రాత్రి పొద్దుపోయే వరకూ సమావేశాలకు సమయాన్ని కేటాయిస్తున్నారని.. అదే మీరు సండే కాకుండా శనివారమే అమరావతికి వచ్చేస్తే.. మేం మా ఫ్యామిలీలతో డిన్నర్ చేయగలుగుతామని పేర్కొన్నారు.
"సమీక్షలు.. సమావేశాలు.. పర్యటనలు ఇలా ముఖ్యమంత్రి నిరంతరం ఏదో ఒక పనిలో ఉంటున్నారు. 24 గంటలూ పని చేసినా హుషారుగానే ఉంటున్నారు. మాకు మాత్రం కష్టమవుతోంది. ఆదివారం మీరు వస్తున్నారు కాబట్టి కుటుంబంతో గడుపుతున్నారు. మీరు శనివారమే వస్తే మాకు కాసింత రిలాక్స్ అవుతుంది. మేం మా కుటుంబంతో కాస్త గడపటానికి అవకాశం ఉంటుంది" అంటూ చెప్పటం ఆసక్తికరంగా మారింది.