అసలే విభజన పోటు. ఆపై ఏపీ ముఖ్యమంత్రి ఆడంబరాల షాకు. వెరసి.. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కిందా మీదా పడుతున్న ఏపీ అంతకంతకూ ఆర్థిక సంక్షోభంలోకి చిక్కుకుపోతోంది. అప్పు తీసుకోనిదే సర్కారు బండి నడిచే అవకాశం లేకున్నా.. ఆడంబరాల కోసం ఇష్టారాజ్యంగా ఖర్చులు చేస్తోంది ఏపీ సర్కారు. దీంతో.. ఏడాదికేడాది అప్పులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
రాబడి లేకపోవటం.. ఖర్చులు మాత్రం భారీగా పెరిగిపోవటంతో లోటు పోటు అంతకంతకూ పెరిగిపోతోంది. గణాంకాల గారడీతో ఏటా భారీ బడ్జెట్ ప్రవేశ పెట్టటం.. ఎంత కుదిరితే అంత అప్పులు తీసుకురావటంతో బండి నడిచిపోతున్నట్లు కనిపిస్తోంది. లెక్కలు లోతుల్లోకి వెళితే గుండెలు గుభేల్ మనటం ఖాయం. ఎందుకంటే.. గడిచిన నాలుగేళ్ల వ్యవధిలో ఏపీ సర్కారు చేసిన అప్పు ఎంతో తెలుసా? గుండెను దిటువ చేసుకొని చదివితే మంచిది.
ఇప్పుడున్న లెక్కల ప్రకారం వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఏపీ అప్పుల భారం ఏకంగా రూ.2,49,435 కోట్లకు చేరనుందని లెక్కలు వేశారు. విభజన సమయంలో రెండు తెలుగు రాష్ట్రాలు అప్పులు పంచుకోగా.. ఏపీ కింద సుమారు రూ.70వేల కోట్లుగా లెక్కేశారు. ఐదేళ్ల స్వల్ప వ్యవధిలో అప్పుల భారం ఎంతగా పెరిగిందో తాజా గణాంకాలు చూస్తే ఇట్టే అర్థమయ్యే పరిస్థితి.
దురదృష్టకరమైన విషయం ఏమిటంటే.. ఇంత అప్పుల కుప్పగా రాష్ట్రం మారినా.. ఎప్పటికప్పుడు అప్పుల కోసం కొత్త దారుల్ని వెతుకుతుందే తప్పించి.. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి పెట్టలేదన్న విమర్శ వినిపిస్తోంది. తాజా పరిస్థితే చూస్తే.. ఎఫ్ ఆర్ బీఎం పరిమితిని దాటి రుణాలు సంపాదించేందుకు ఏపీ రాష్ట్ర సర్కారు కొత్త మార్గాల్ని అన్వేసిస్తుంది. అంటే.. ఇప్పుడున్న అప్పు సరిపోక.. మరింత అప్పు చేయటం కోసం ప్లాన్లు వేస్తోంది.
ఇందులో భాగంగా కార్పొరేషన్లకు అప్పులు తీసుకునేందుకు మంత్రిమండలిలో ఆమోదం పొంది.. వాటి పరిమితిని పెంచటం.. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలని ప్రయత్నిస్తోంది. తీసుకున్న రుణాల్ని పీడీ ఖాతాలకు రప్పిస్తూ అక్కడి నుంచి ప్రభుత్వం తీసుకొని ఖర్చు చేస్తోంది. సహజంగా రాష్ట్ర అప్పుల్ని సదరు రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తితో పోలుస్తుంటారు. ఏపీ పరిస్థితి చూస్తే. అప్పుల భారం అంతకంతకూ ఎక్కువ అవుతున్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి.
2014-15 ఆర్థిక సంవత్సరంలో 28.25 శాతం ఉండగా.. ఆ తర్వాత 28.50 శాతానికి చేరింది. 2016-17 సంవత్సరంలో అయితే ఇది గరిష్ఠంగా 28.79శాతానికి చేరింది. 2017-18లో సవరించిన అంచనాలను పరిశీలిస్తే మళ్లీ అప్పుల భారం స్థూల ఉత్పత్తితో పోలిస్తే కొంత తగ్గింది. అది 28.40శాతానికి చేరింది. అయితే..ఈ ఆనందం తాత్కాలికమే. ఎందుకంటే.. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అప్పులు శాతం మరింత పెరుగుతుందని.. అది రికార్డు స్థాయిలో 28.66 శాతానికి చేరుకుంటుందని ఆర్థికశాఖ రూపొందించిన నివేదిక స్పష్టం చేస్తోంది. సమర్థుడు.. ఎంతో అనుభవం ఉన్న బాబు పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందన్నది ఈ గణాంకాలు చెప్పేస్తుంటాయి. గణాంకాల కోసం.. లెక్కల కోసం కమిటీలు వేసే పవన్ కల్యాణ్ సార్ లాంటోళ్లు ఇలాంటి అంకెల మీద ఇప్పుడే దృష్టి పెడితే బాబుగారి అనుభవంతో కూడిన పాలన ఎంత భేషుగ్గా ఉందో అర్థమైపోతుంది.