తెలుగు నేల విభజన తర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన నవ్యాంధ్రను తాను మాత్రమే ఒడ్డున పడేస్తానంటూ బీరాలు పలికిన టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు... తన ఐదేళ్ల పాలనలో తన అనుయాయులకు మాత్రమే లబ్ధి చేకూరేలా పనులు కట్టబెట్టారని, తనకు నచ్చిన సంస్థలు ఎలాంటివన్న విషయాన్ని కూడా చంద్రబాబు పట్టించుకోలేదన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సీఎం కుర్చీ దిగేదాకా ఈ తరహాలోనే కాంట్రాక్టులు కట్టబెట్టారని కూడా ప్రస్తుతం అధికార పార్టీగా ఉన్న వైసీపీ ఆరోపిస్తున్న సంగతీ తెలిసిందే. ఈ దిశగా వైసీపీ చేసిన ఆరోపణలు నిజమేనంటూ ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. తన హయాంలో నెల్లూరు జిల్లాలో దగదర్తి ఎయిర్ పోర్టు కాంట్రాక్టును చంద్రబాబు కట్టబెట్టిన సంస్థ టర్బో ఏవియేషన్ ఇప్పుడు దివాలా సంస్థగా తేలిపోయింది.
నెల్లూరు సమీపంలోని దగదర్తిలో ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం గతంలో చంద్రబాబు సర్కారు నిర్ణయం తీసుకుంది. ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం పిలిచిన టెండర్ ను తనకు అనుకూలంగా నిలిచిన టర్బో ఏవియేషన్ కు చంద్రబాబు కట్టబెట్టారు. అది కూడా ఎన్నికలు మరో నాలుగైదు నెలలు ఉన్నాయనగా చంద్రబాబు ఈ కాంట్రాక్టును ఖరారు చేశారు. కాంట్రాక్టును దక్కించుకున్న టర్బోఏవియేషన్... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ (ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్- ఏపీఎస్ఎఫ్ సీ) వద్ద తీసుకున్న రూ.2.38 కోట్ల చిన్నపాటి రుణాన్ని కూడా కట్టకుండా చేతులెత్తేసింది. ఈ రుణం వసూలు కోసం వీలయినన్న సార్లు నోటీసులు జారీ చేసిన ఎస్ఎఫ్ సీ... టర్బో నుంచి స్పందన లేకపోవడంతో ఆ కంపెనీని దివాలా తీసిన కంపెనీగా ప్రకటిస్తూ గత నెల 28న నోటీసు జారీ చేసింది.
అంతేకాకుండా తాను తీసుకున్న రుణానికి పూచీకత్తుగా పెట్టిన టర్బో కంపెనీ ఆస్తులను కూడా జప్తు చేస్తున్నట్లు ఎస్ఎఫ్ సీ సంచలన ప్రకటన చేసింది. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో టర్బో ఏవియేషన్ కొనుగోలు చేసిన శ్రీవారి విల్లాతో పాటు అదే జిల్లాలోని రేణిగుంట సమీపంలోని శెట్టిపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో సంస్థ కొనుగోలు చేసిన స్థలాన్ని జప్తు చేస్తున్నట్లుగా ఎస్ఎఫ్ సీ ప్రకటించింది. కేవలం రూ.2.38 కోట్ల రుణాన్ని కూడా చెల్లించలేని టర్బో ఏవియేషన్ కు చంద్రబాబు సర్కారు... నెల్లూరు ఎయిర్ పోర్టు కాంట్రాక్టును ఎలా కట్టబెట్టిందన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తంగా దివాలా కంపెనీగా మారిపోయిన టర్బో ఏవియేషన్... బాబు మార్కు కాంట్రాక్టులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని తేటతెల్లం చేసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి.