ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్..మరోసారి అగ్రస్థానంలో ఏపీ!

Update: 2020-02-26 12:10 GMT
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో ఆంధప్రదేశ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచి తన సత్తా చాటింది. గతంలో తెలంగాణ తో పాటుగా తోలి స్థానంలో నిలిచిన ఏపీ - ఈసారి టాప్ పొజిషన్ ని చేజిక్కించుకుంది. 2018 తరువాత ఏపీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో అగ్రస్థానంలో నిలవడం  ఇది రెండోసారి. మొత్తంగా దేశంలోనే పెట్టబడులు పెట్టడానికి అత్యంత అనువైన రాష్ట్రం ఏపీనే అని  ఇన్వెస్ట్ ఇండియా తెలిపింది. ap ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో  మొదటిస్థానం లో ఉంది అని చెప్పడానికి పరిగణనలోకి తీసుకున్న  ఆశలని ఒకసారి పరిశీలిస్తే ...

ఏపీలో క్రియాశీలకంగా ఉన్న ప్రత్యేక ఆర్థిక మండళ్లు - లాజిస్టిక్స్ - పారిశ్రామిక ఉత్పత్తులను తరలించడానికి అనువైన రవాణా సౌకర్యాలు - పరిశ్రమలను ఏర్పాటు చేయడానికి భూములు అందుబాటు ఉన్నాయి.అలాగే  పారిశ్రామిక ప్రాంతాలతో పాటు వాటికి కల్పించిన మౌలిక సదుపాయాలు - రాష్ట్ర ప్రభుత్వం అనుసరించే పారిశ్రామిక విధానం...వీటితోనే పెట్టుబడులను పెట్టడానికి అత్యంత అనువైన రాష్ట్రంగా ఇన్వెస్ట్ ఇండియా గుర్తించింది. 

అలాగే , రాష్ట్రంలో శ్రీసిటీ వంటి 29 ప్రత్యేక ఆర్థిక మండళ్లు క్రియాశీలకంగా ఉన్నాయని - వాటిల్లో పెట్టుబడులు పెట్టే పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం అనేక రాయితీలను కల్పిస్తోందని - దానికోసం ప్రత్యేకంగా ఏపీఐఐసీ  ప్రభుత్వ ఖాళీ స్థలాలతో కూడిన ల్యాండ్ బ్యాంక్‌ ను ఏర్పాటు చేసిందని తెలిపింది. అలాగే రాష్ట్రంలో మొత్తం ఆరు విమానాశ్రయాలు ఉన్నాయని , అందులో 3  అంతర్జాతీయ స్థాయి ఎయిర్ పోర్ట్స్ కాగా , మరో మూడు   డొమెస్టిక్‌ ఎయిర్ పోర్ట్స్. అలాగే విశాఖపట్నం - కృష్ణపట్నం - మచిలీపట్నం - కాకినాడ ఓడరేవులతో పాటు దేశంలోనే అతి పొడవైన సముద్ర తీర ప్రాంతాన్ని కలిగి ఉందని ఇన్వెస్ట్ ఇండియా వెల్లడించింది. ఈ కారణాలతోనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ లో ఏపీకి మొదటి స్థానం కల్పించినట్టు తెలిపింది.

Tags:    

Similar News