తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేస్తున్న అయుత చండీ యాగానికి ఆరు రాష్ట్రాల నుంచి 1500 మంది రుత్విక్కులను పిలిచారని మొదటి నుంచీ చెబుతున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రుత్విక్కులు కూడా ఉన్నారని చెబతున్నారు. కానీ అసలు వాస్తవం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ కు చెందిన రుత్విక్కులు ఎవరికీ అయుత చండీ యాగానికి ఆహ్వానం రాలేదట. ఆంధ్రా రుత్విక్కులు అయుత చండీ యాగానికి దూరంగానే ఉన్నారట.
ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించే యాగంలో కర్ణాటక - మహారాష్ట్ర - ఉత్తరప్రదేశ్ - తమిళనాడు - తెలంగాణలకు చెందిన రుత్విక్కులే పాల్గొన్నారని యాగంలో పాల్గొన్న వర్గాలు చెబుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ వేద పండితులకు - ఘనాపాఠీలకు పెట్టింది పేరు అయినా అక్కడి వేద పండితులున ఎవరినీ అయుత చండీ యాగానికి ఆహ్వానించలేదని, తాము ఎవరం అందులో పాల్గొనలేదని ఆంధ్రా ప్రాంతానికి చెందిన వేద పండితులు తెలిపారు. శృంగేరీ పీఠంలోని పండితుల్లో అత్యధికులు ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు అయినా.. వారంతా పీఠం తరఫునే యాగంలో పాల్గొన్నారని వివరిస్తున్నారు.
నిజానికి అయుత చండీ యాగాన్ని లోక కల్యాణానికి నిర్వహిస్తారని, అటువంటి లోక కల్యాణానికి నిర్వహించే హోమాలు - యాగాల్లో ద్వేషం - వివక్ష - అసూయ వంటి వాటికి స్థానం ఉండరాదని, కానీ, కేసీఆర్ నిర్వహించే యాగంలో వాటికి పెద్దపీట వేసి మరీ నిర్వహిస్తున్నారని పలువురు వేద పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.