జూలైలోనే రాజమండ్రి విద్యార్థులకు ''దసరా'' సెలవులు

Update: 2015-06-26 08:33 GMT
జూలైలో దసరా ఏంటన్న సందేహం అక్కర్లేదు. సహజంగా వేసవి సెలవుల తర్వాత.. స్కూళ్లకు ఎక్కువగా సెలవులు వచ్చే సందర్భాలు రెండే రెండు. అందులో ఒకటి దసరా. రెండోది సంక్రాంతి. ఈ రెండు పండగలకు తక్కువలో తక్కువ పది రోజులు సెలవులు ఇచ్చేస్తుంటారు.

సహజంగా సెప్టెంబరు.. అక్టోబరులో దసరా సెలవులు వస్తుంటాయి. కానీ.. జూన్‌లోనే అన్ని సెలవులు ఇవ్వటానికి కారణం పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే గోదావరి పుష్కరాలు. ఈ పుష్కరాల సందర్భంగా భారీగా యాత్రికులు వచ్చే నేపథ్యంలో.. పిల్లలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వీలుగా రాజమండ్రి పట్టణంలోని స్కూళ్లకు సెలవులు ఇవ్వాలని ఏపీ సర్కారు నిర్ణయించింది.

జూలై 14 నుంచి జూలై 25 వరకు పుష్కరాల సెలవులు రాజమండ్రి స్కూళ్లకు ఇవ్వాలని నిర్ణయించారు. దీంతో.. రాజమండ్రి పట్టణంలోని విద్యార్థులకు విద్యా కాలెండర్‌లో పేర్కొన్న విధంగా కాకుండా మరిన్ని సెలవులు రానున్నాయి. మరి.. తెలంగాణ సర్కారు ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

Tags:    

Similar News