దేశం కాని దేశంలో మనోళ్లు ప్రమాదవశాత్తు మరణించటం ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తాజాగా జర్మనీలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఒక పడవ ప్రమాదంలో ఏపీకి చెందిన ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయిన విషాద ఉదంతం వెలుగులోకి వచ్చింది.
ప్రకాశం జిల్లా కొండపి పంచాయితీ పరిధిలోని కట్టవారి పాలెంకు చెందిన రేషన్ డీలర్ కట్టా రమణయ్య కుమారుడు మల్లికార్జునరావు రెండు నెలల కిందట జర్మనీకి వెళ్లాడు. ఉద్యోగంలో భాగంగా వెళ్లిన అతడు ఈఎస్ ఎస్ ఎన్ సిటీలో మెకానికల్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు.
విహారయాత్రకు స్నేహితులతో వెళ్లిన మల్లికార్జునరావు ఒక పడవలో ప్రయాణానికి వెళ్లారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వీరు ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మల్లికార్జునరావుతో పాటు మరో యువకుడు కూడా మరణించినట్లుగా చెబుతున్నారు.
మల్లికార్జునరావు మరణించినట్లుగా ఈ రోజు (సోమవారం) తెల్లవారుజామున ప్రకాశం జిల్లాలోని తల్లిదండ్రులకు ఫోన్ లో సమాచారం అందింది. చేతికి వచ్చిన కొడుకు అకాల మరణం చెందటంపై మల్లికార్జునరావు తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. మృతదేహాన్ని జర్మనీ నుంచి తెప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఉదంతంతో గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.