జనంలోకి కాదు.. జనం మాటే వింటాను.. జగన్ నిర్ణయం సక్సెస్ అయ్యేనా..?
వైసీపీ అధినేత, సీఎం జగన్.. జనంలోకి ఎప్పుడు వస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. 2009లో అధికారంలోకి వచ్చిన వైఎస్.. కేవలం 4 నెలల కాలంలోనే ప్రజల్లోకి రావాలని తలపించారు. ఈ క్రమంలోనే రచ్చబండ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇక, ఇప్పుడు తండ్రి అడుగు జాడల్లో నడుస్తానని చెబుతున్న సీఎం జగన్.. మూడున్నరేళ్లు గడిచిపోయినా.. ప్రజల్లోకి మాత్రం ఇప్పటికీ రాలే దు. ఇటీవల కాలంలో వివిధ పథకాల కోసం బయటకు వస్తున్నాదీని ప్రభావం ప్రజలపై పెద్దగా కనిపించడం లేదు.
కేవలం ఆయన కార్యక్రమాల వరకే పరిమితం అవుతున్నారు. అయితే, జగన్ కూడా రచ్చబండకు రెడీ అవుతున్నారని.. ఆయన త్వరలోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతారని.. ప్రజల సమస్యలు తెలుసు కుంటారని కొన్నాళ్లుగా తాడేపల్లి వర్గాలు లీకులు ఇస్తున్నాయి.
కానీ, ఇప్పటి వరకు దీనికి సంబంధించి అధికారికంగా ఎవరూ ప్రకటన చేయలేదు. దీంతో రచ్చబండ కార్యక్రమం ఇకలేనట్టేనని అంటున్నారు పరిశీలకులు. అంతేకాదు, ప్రజల మధ్యకు వచ్చే అవకాశం కూడా లేకుండా పోయిందని చెబుతున్నారు.
అయితే, ఇటీవల సీఎం జగన్ ఒక వినూత్న కార్యక్రమాన్ని ఎనౌన్స్ చేశారు. 'జగనన్నతో చెబుదాం!' అనేది ఈ కార్యక్రమం పేరు. వాస్తవానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఈ నెల 2వ తేదీనే ఈ కార్యక్రమం ప్రారంభించి ఉండాలి. కానీ, కాలేదు. అయితే, ఈ కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తారని.. దీనిని త్వరలోనే ప్రారంభిస్తారని సీఎం జగన్ చెబుతున్నట్టుగా పార్టీలో అయితే చర్చ సాగుతోంది. దీనిలో భాగంగా సీఎం జగన్ స్వయంగా ప్రజల నుంచి సమస్యలు వింటారని చెబుతున్నారు.
అయితే, ఇది ఏమేరకు సీఎం జగన్‌కు కానీ, పార్టీకి కానీ మేలు చేస్తుందనే చర్చ సాగుతోంది. ఎందుకంటే.. ప్రజలు ఫోన్లు చేసి.. చెప్పుకొన్నా ఆయా సమస్యలు తీరుతాయా? అనే సందేహం ఇప్పటికీ కలుగుతోంది.
దీనికితోడు ఏ సమస్య చెప్పాలన్నా.. ఫోన్లలో ప్రజలు ఇబ్బందులు పడతారనే వాదన కూడా ఉంది. వీటిని రికార్డు చేస్తారు.. పేర్లు వివరాలు కూడా చెప్పాలి. దీంతో ఇదితమకు భవిష్యత్తులో ఇబ్బంది కలిగించేదేనని అంటున్నారు ప్రజలు. మరి వైసీపీ నేతలు దీనిని ఎలా ముందుకు తీసుకువెళ్తారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.