కేసీయార్ కి ఏపీలో ఫ్యాన్ మెయిల్ ఒక్కసారిగా పెరిగిపోతోంది. సరిహద్దులను బద్ధలు కొడుతూ అమితమైన ఆంధ్రా ప్రేమ కేసీయార్ నీకే సొంతం అంటోంది. కేసీయార్ కి జై అంటున్నారు ఆంధ్ర యువత. ఇంతకీ ఆంధ్రా యువకులను కేసీయార్ అంతలా ఆకట్టుకున్న విషయం ఏంటి అంటే ఒక్కసారిగా తొంబై వేల పై చిలుకు పోస్టులను ఆయన తన స్టేట్ లో భర్తీ చేయాలని నిర్ణయించడం.
అంతే కాదు ప్రతీ ఏటా జాబ్ క్యాలండర్ ఠంచనుగా అమలు చేస్తామని, ఇక కాంట్రాక్ట్ పోస్టులు అన్న మాటే తెలంగాణాలో వినబడకుండా చేస్తామని కేసీయార్ చేసిన బిగ్ సౌండ్ కి ఏపీ యువత ఒక్కసారిగా ఫిదా అయిపోతోంది. కేసీయార్ అందుకో మా నీరాజనాలు అని అంటోంది. నీవు కదా అసలు సిసలు పరిపాలకుడువి అంటే శభాష్ ఏలికా అని నినదిస్తోంది.
కేసీయార్ చిత్ర పటానికి పాలాభిషేకం చేస్తూ దార్శనీకుడు, యువత ఆశలను తీర్చే పాలకుడు అని కితాబు ఇస్తున్నారు. విశాఖలో కేసీయార్ జై నినాదాలు మారుమోగుతున్నాయు. ఏపీ నిరుద్యోగుల జేఏసీ అయితే కేసీయార్ వంటి ముఖ్యమంత్రి వుండడం వల్లనే తెలంగాణా యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలను పొందుతున్నారని అంటోంది.
కేసీయార్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకమనికూడా ప్రశంసిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం అంగలార్చి చూస్తున్న యువతకు కేసీయార్ వరాన్నే ఇచ్చారని అని కొనియాడుతోంది. అంతే కాదు, కేసీయార్ బాటలో నడవాలని ఏపీ సీఎం కి సూచిస్తోంది. ఏపీలో జగన్ పాదయాత్ర సందర్భంగా లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారని, కానీ ఆచరణలో ఏమీ జరగలేదని కూడా ఎత్తి చూపుతోంది.
అందుబాటులో ఉన్న లెక్కల ప్రకారం ఏపీలో రెండు లక్షల ముప్పయి వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, జగన్ కూడా వాటిని భర్తీ చేస్తే తాము సంతోషిస్తామని చెబుతోంది. అంతే కాదు, వయోపరిమితిని 47 ఏళ్లకు పెంచి జగన్ ఏపీ యువతకు భవితను చూపాలని డిమాండ్ చేస్తోంది.
మొత్తానికి ఏపీ నిరుద్యోగులు అయితే కేసీయార్ మీద పొగడ్తల వర్షం కురిపించేస్తున్నారు. కేసీయార్ సారూ తలచుకుంటే చేసేస్తారూ అంటూ కీరిస్తున్నారు. మరి ఏపీ సీఎం జగన్ కి ఇది నిజంగా ఇరకాటమే. సాటి తెలుగు ముఖ్యమంత్రికి ఆంధ్రా గడ్డ మీద ప్రశంసలు దక్కడం అంటే మాటలు కాదు, అలాంటిది కేసీయార్ కి జై అంటూ జేజేలు కొడుతున్నారు అంటే అది వైసీపీకి రాజకీయంగా ఇరకాటమే అని చెప్పాలి.
మరి దీన్ని అధిగమించాలి అంటే కనుక కేసీయార్ బాటలోనే జగన్ తప్పనిసరిగా నడవాల్సి ఉంటుంది. అంతే కాదు పోస్టులను కూదా తీయాల్సి ఉంటుంది. మరి జగన్ ఆ డేరింగ్ స్టెప్ వేయగలరా. ఏపీ యువత మనసు దోచడంతో కేసీయార్ తో పోటీ పడగలరా. వెయిట్ అండ్ సీ.