ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ ఆండ్రూ ఫ్లింటాఫ్ కారు ప్రమాదానికి గురయ్యాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోవడం అతడి అభిమానులు.. క్రికెట్ లవర్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఫ్లింటాఫ్ కు రేసింగ్ చాలా ఇష్టం. ఈ క్రమంలోనే కొంతకాలంగా డ్రాస్ రేసు కార్యక్రమానికి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తున్నాడు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్లింటాప్ రేసింగ్ ఈవెంట్స్ పాల్గొన్నాడు.
అయితే ఫ్లింటాఫ్ నడుపుతున్న రేసింగ్ కారు టాప్ గేర్ టెస్ట్ ట్రాక్ లో దూసుకెళ్తున్న క్రమంలోనే అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో ఫ్లింటాఫ్ (ఫెడ్డీ)కి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే స్పందించిన క్రూ మెడికల్ టీం రంగంలోకి ఫెడ్డీకి ప్రాథమిక చికిత్స అందించారు. ఆ వెంటనే సర్రేలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
అయితే ఫ్లింటాఫ్ కారు రేసింగ్ ప్రమాదం బారిన పడటం ఇది రెండోసారి. 2019 సంవత్సరంలోనూ ప్లింటాప్ కారు రేసింగ్ పాల్గొని ప్రమాదం బారిన పడ్డాడు. 125 కిలో మీటర్ల వేగంతో ట్రాక్ పైకి దూసుకెళ్తున్న క్రమంలో కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఫెడ్డీ నాడు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ఫెడ్డీ తర్వాత స్పందించారు.
టాప్ గేర్ డ్రాగ్ రేసులో తన పాత్రను చక్కగా పోషించేందుకు ఎంత దూరమైనా వెళ్తానని ఫెడ్డీ స్పష్టం చేశాడు. అయితే ఈసారి మరీ ఎక్కువ దూరం వెళ్లిపోవడంతో ప్రమాదం జరిగిందని చమత్కరించాడు. ఈ సంఘటనను మీరు టీవీల్లో వీక్షిస్తే ప్రమాదకరం అనే కన్నా పిచ్చితనంగా కన్పిస్తుందని వెల్లడించాడు.
తాజాగా సర్రేలో జరిగిన రేసింగ్ ఈవెంట్లోనే ఫెడ్డీ మరోసారి కారు ప్రమాదానికి గురై తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కాగా ప్లింటాప్ 2009లో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఇంగ్లాండ్ తరుపున 79 టెస్టులు.. 141 వన్డేలు ఆడాడు. 2005లో జరిగిన యాషెస్ సిరీస్ లో ప్లేయర్ ఆఫ్ ది అవార్డు అందుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత ఫెడ్డీ డ్రాగ్ రేసులో హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.