స‌మ‌స్య‌లు విన‌లేక పోతున్నారే.. ఎందుకింత ఫ్రస్ట్రేష‌న్ వైసీపీ నేత‌ల్లో?

Update: 2022-12-25 12:30 GMT
వైసీపీ నేత‌ల్లో ఆగ్ర‌హం.. అంత‌కుమించిన ఒత్తిడి.. ఈ రెండు క‌లిపి ఫ్రెస్ట్రేష‌న్ పెరిగిపోతున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఎమ్మెల్యేలుగా ఉన్న వారు.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు వినాలి.. ప‌ట్టించుకుని ప‌రిష్క‌రించేందుకు ప్ర‌య‌త్నించాలి. లేదా.. మౌనంగా అయినా.. ఉండాలి. రెండు చేయ‌కుండా.. స‌మ‌స్య‌లు చెప్పిన ప్ర‌జ‌ల‌పైకి దూకుడు ప్ర‌ద‌ర్శించి కేసులు పెట్టించ‌డం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం?!

ఈ త‌ర‌హ ప‌రిస్థితి ఇప్పుడు ఏపీలోచాలా జిల్లాల్లో క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేం దుకు ప్ర‌య‌త్నిస్తున్న వైసీపీ. ఎమ్మెల్యేలు, మంత్రుల‌ను జ‌నాల మ‌ధ్య‌కు పంపుతున్న విష‌యం తెలిసిం దే. ఈ క్ర‌మంలో ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌ల‌ను విన్న‌విస్తున్నారు. కానీ, ఎమ్మెల్యేలు చాలా చోట్ల ప్ర‌జ‌ల‌పై ఎదురు దాడి చేస్తున్నారు.

తాజాగా.. చిత్తూరు జిల్లాలో ఓ మంత్రి గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పింఛ‌న్ ఆగిపోయింది.. అంటూ.. కొంద‌రు వృద్ధులు ఆయ‌న‌కు మొర‌పెట్టుకున్నారు. దీంతో స‌ద‌రు కీల‌క నేత‌, మంత్రి స్తానంలో ఉన్న ఆయ‌న‌.. ``పోవ‌మ్మ‌.. ఎప్పుడూ.. అది రాలేదు.. ఇది రాలేదు అనే ఏడుస్తారు. ఇచ్చిన వాటి గురించి చెప్పుకోవ‌చ్చుగా!`` అని ఖ‌సురుకున్నారు.

ఇక‌, అనంత‌పురం జిల్లా ఎస్సీ నియోజ‌క‌వ‌ర్గం శింగ‌న‌మ‌ల‌లో స్థానిక క‌స్తూరిబాయి గురుకుల‌ స్కూళ్ల‌లో  విద్యార్థినులు ఈ నెల‌లో రెండు సార్లు అస్వ‌స్థ‌త‌కు గురై.. ఆసుప‌త్రి పాల‌య్యారు. దీనికి కార‌ణం.. ఫుడ్ పాయిజ‌నింగ్ అనేది అధికారులు తేల్చిన సంగ‌తి. మ‌రి విద్యార్థి సంఘాలు ఊరుకోవు క‌దా.. ఇదే విష‌యాన్ని ఎమ్మెల్యే జొన్న‌గ‌డ్డ ప‌ద్మావ‌తిని ప్ర‌శ్నించారు.

అయితే.. ఆమె మాత్రం రివ‌ర్స్ ఎటాక్ ఇచ్చింది. త‌నను ప్ర‌శ్నించేందుకు వ‌చ్చిన విద్యార్థి నేత‌ల‌ను  ``మీరంతా తాగున్నారు. త‌ప్ప‌తాగి వ‌చ్చి న‌న్ను ప్ర‌శ్నిస్తారా.. బ్రీత్ అన‌లైజ‌ర్స్‌తో ప‌రీక్ష చేయాలి`` అంటూ.. పోలీసుల‌ను ఆదేశించింది. దీంతో ఇది కాస్తా మ‌రో వివాదంగా మారి.. నియోజ‌క‌వ‌ర్గం అట్టుడుకుతోంది. మ‌రి ఎమ్మెల్యేల‌కు ఇంత ఫ్రెస్ట్రేష‌న్ ఎందుకు? అనేది ప్ర‌శ్న‌.
Tags:    

Similar News