భార్యాభర్తల మధ్య రచ్చ అంతకంతకూ పెరగటమే కాదు.. వేరే దేశానికి వెళ్లే దారిలో ఉన్న సదరు విమానం ఏకంగా చెన్నైకి తీసుకొచ్చిన చిత్రమైన ఉదంతమిది. ఇరాన్ కు చెందిన భార్యభర్తలు దోహాకు వెళ్లారు. అక్కడంతా బాగానే ఉంది. దోహా నుంచి బాలీ కు వెళ్లే ఖతార్ ఎయిర్ లైన్స్ విమానంలో వారు ఎక్కారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది.
ఫ్లైట్ ఎక్కిన కాసేపటికి భర్త గాఢ నిద్రలోకి జారిపోయాడు. పక్కన కూర్చున్న భార్యకు బోర్ కొట్టింది. భర్త తీరు మీద ఉన్న అనుమానంతో ఫోన్ లో ఏముందో చూడాలన్న కుతూహలాన్ని ప్రదర్శించిందా శ్రీమతి. భర్త స్మార్ట్ ఫోన్ ను తీసుకుంది. వేలిముద్రల ద్వారా ఓపెన్ అయ్యే ఫోన్ ను అన్ లాక్ చేసే ప్రయత్నం చేసింది.
అంతోనే భర్తకు మెలుకువ వచ్చింది. ఛత్.. నా ఫోన్ తీస్తావా? అది కూడా నేను నిద్రపోతున్న టైంలో అంటూ ఆరిచేశాడు. దాంతో ఒళ్లుమండిన భార్యమణి.. అతడికి ధీటుగా బదులిచ్చింది. ఇలా వారి మధ్య గొడవ చిలికి చిలికి గాలివానగా మారింది.
భార్యభర్తల భాగోతం.. ఫ్లైట్లో ఉన్న ప్రయాణికులకు షాకింగ్ గా మారింది. గొడవ ఎందుకంటూ సర్ది చెప్పబోయిన తోటి ప్రయాణికులు మొదలు విమాన సిబ్బంది వరకూ ఎవరి మాటా వినలేదు. వీరి గొడవ ముదిరి భారీగా మారటంతో విమానం గమ్యస్థానం వెళ్లటం మానేసి.. వీరిని ఎక్కడో అక్కడ దించేయాలని సిబ్బంది భావించారు.
ఆ వెంటనే చెన్నై ఎయిర్ పోర్ట్ ను ఆశ్రయించిన విమాన సిబ్బంది.. అక్కడి వారి అనుమతితో విమానాన్ని చెన్నైలో నిలిపారు. గొడవ పడుతున్న భార్యభర్తల్ని విమానం నుంచి బయటకు పంపి.. వేరేవిమానంలో రావాల్సిందిగా వారికి చెప్పారు. దీంతో.. బాలీఖతార్ కు వెళ్లాల్సిన భార్యాభర్త.. వారి పిల్లలు విమానం దిగాల్సి వచ్చింది. విమానయాన కంపెనీ వీరికి మరో విమానంలో ప్రయాణించి.. గమ్యస్థానానికి చేరుకునేందుకు వేరే విమానంలో ఏర్పాట్లు చేశారు. ఈ భార్యభర్తల వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.