కరోనాపై అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ ఇప్పటికే కర్నూలులో ఓ వ్యక్తి ఫిర్యాదు మేరకు టీడీపీ అధినేత చంద్రబాబుపై ఓ కేసు నమోదైంది. అది మరిచిపోక ముందే తాజాగా మరో కేసు గుంటూరులో నమోదైంది. గుంటూరు జిల్లా అరండల్ పేట పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదైంది.
కరోనాపై చంద్రబాబు అసత్య ప్రచారం చేస్తూ ప్రజలను భయ బ్రాంతులకు గురిచేస్తున్నారంటూ న్యాయవాది పచ్చల అనిల్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కరోనా పట్ల ప్రజలు భయపడేలా చంద్రబాబు, టీడీపీ నేతలు మాట్లాడారని అనిల్ కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అనిల్ ఫిర్యాదును స్వీకరించిన అరండల్ పేట పోలీసులు.. చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. 188,505(1)b, 505(2) సెక్షన్ల కింద బాబుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
చంద్రబాబుపై కేసులను టీడీపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వం కావాలనే తప్పుడు కేసులు పెట్టిస్తోందని ఆరోపిస్తున్నారు.