ప్రస్తుతం భారతదేశం మొత్తాన్ని కలవర పెడుతున్న వాటిలో మొదటిది కరోనా కాగా.. రెండోది డెంగ్యూ. ఈ వ్యాధి తో బాధపడే వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. డెంగ్యూ వ్యాధి ఉన్నవారికి కామెర్లు త్వరగా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి చిన్న పిల్లల్లో అయితే ప్రాణాంతకంగా మారడం లేదు కానీ.. పెద్దవారిలో మాత్రం ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. అందుకనే ఈ వ్యాధి సోకిన వారు తరచుగా కామెర్లకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం దేశవ్యాప్తంగా నమోదైన డెంగ్యూ కేసుల్లో ఎక్కువమందికి కామెర్లు సోకడం. ఈ విషయం ప్రస్తుతం వైద్యులను ఆందోళనకు గురి చేస్తోంది.
ఇటీవల డెంగ్యూ తో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆసుపత్రిలో చేరారు. అయితే అతనికి పరీక్షలు చేయగా కామెర్లు కూడా ఉన్నట్లు తేలింది. అప్పటికే శరీరమంతా పూర్తిస్థాయిలో పసుపు రంగులోకి మారడం గమనించిన వైద్యులు వ్యాధి తీవ్రతను అంచనా వేశారు. దీనికి తోడు అతనికి వాంతులు విరేచనాలు అవడం వారని ఆందోళనకు గురి చేసింది. రోగి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతున్నట్లు గమనించిన వైద్యులు.. ఇందుకు విరుగుడుగా ఆ రోగికి స్టెరాయిడ్స్ తో చికిత్స చేశారు .
దీంతో ఆ వ్యక్తి ప్రమాదం నుంచి బయట పడ్డాడు. అయితే ఈ కేసులో అతని కాలేయం మీద తీవ్ర ప్రభావం పడింది. అందుకనే డెంగ్యూ తో బాధపడుతున్న వారు కచ్చింతంగా కామెర్లకు సంబంధించి పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. లేకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి రావచ్చని హెచ్చరిస్తున్నారు. ఈ వ్యాధికి సంబంధించి సకాలంలో చికిత్స తీసుకోకపోతే అది కాస్తా తీవ్రతరమై ప్రాణాలకే హాని చేస్తోందని చెప్తున్నారు.
కామెర్లు ఉన్న వ్యక్తిలో కనిపించే ప్రధాన లక్షణాలు ఏమిటో ఓసారి మనం కూడా తెలుసుకుందాం... కామెర్లు సోకినప్పుడు శరీరం పసుపు రంగులోకి మారిపోతుంది. అంతేకాకుండా కళ్లు పాలిపోయినట్లు కనిపిస్తాయి. మూత్రం కూడా రంగు మారుతుంది. వీటికి తోడు వాంతులు, విరేచనాలు కూడా అవుతాయి. వాష్ రూమ్ కి వెళ్లినప్పుడు మలంలో రక్తం స్రావం కావడం లేదా రంగు మారడం జరుగుతుంది. వీటిని బట్టి కామెర్లను అంచనా వేయాల్సి ఉంటుంది. ఈ లక్షణాలను రోగి గుర్తించినట్లయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఇందుకు తగిన చికిత్స తీసుకోవాలి.
కామెర్ల నుంచి బయటపడడానికి వైద్య నిపుణులు కొన్ని మార్గాలను సూచిస్తున్నారు. కామెర్లు ఎక్కువగా ఉన్నప్పుడు లేదా సంబంధించిన లక్షణాలను గుర్తించిన వెంటనే టీకా వేయించుకోవడం మంచిదని చెబుతున్నారు. కామెర్లు కనిపించిన నాటినుంచి రోగి ఎక్కువ నీరుని తీసుకోవాలని చెబుతున్నారు. మద్యం తాగే అలవాటు ఉన్నవారు కామెర్లు తగ్గేంత వరకూ దానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. బయట దొరికే చిరుతిళ్లకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. వీటిని పాటిస్తే కొంతమేరకు కామెర్లు రాకుండా చూసుకోవచ్చచని అభిప్రాయపడుతున్నారు.