మిర్యాలగూడలో ప్రణయ్ పరువు హత్య దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. తన కూతురు అమృతను కులాంతర వివాహం చేసుకున్నాడన్న అక్కసుతో ప్రణయ్ ను అత్యంత దారుణంగా మారుతీరావు హత్య చేయించాడు. అంతేకాకుండా, ప్రణయ్ ను హత్య చేయించినందుకు మారుతీరావు పశ్చాత్తాపం కూడా వ్యక్తపరచకుండా ఉండడం పోలీసులను కూడా విస్మయానికి గురి చేసింది. ఈ నేపథ్యంలో ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ రకంగా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలు భయభ్రాంతులకు గురవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రణయ్ - అమృత తరహాలో కులాంతర వివాహం చేసుకున్న మరో జంట మీడియా ముందుకు వచ్చింది. కొంతమంది నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ ఓ జంట మీడియాను ఆశ్రయించింది. తమకు చాలాకాలంగా బెదిరింపులు వస్తున్నాయని - తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.
నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన సత్యం రెడ్డి - పద్మావతి దంపతుల కుమార్తె శివదీప్తి రెడ్డి - కడప ప్రాంతంలో లాండ్రీ నడుపుకుంటున్న విజయ్ కుమార్ లు కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నారు. తమ ప్రేమను దీప్తి తల్లిదండ్రులు అంగీకరించకపోవడంతో....ఈ ఏడాది జూలై 26న కడపలోని ఓ చర్చిలో వారిద్దరూ వివాహం చేసుకున్నారు. తమ కూతురు కులాంతర వివాహం చేసుకొని పరువు తీసిందని ఆగ్రహంతో ఉన్న దీప్తి తల్లిదండ్రులు తమను బెదిరిస్తున్నారని దీప్తి...మీడియా ముందు వెల్లడించింది. తన బంధువులు చరణ్ రెడ్డి - రవీందర్ రెడ్డి పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో ఉన్నారని - వారంతా తమ ఇద్దరినీ వేధిస్తున్నారని కన్నీటిపర్యంతమైంది. ఆ పోలీసుల సాయంతో తమను వెంటాడుతున్నారని - తమ సెల్ ఫోన్లను ట్రేస్ చేస్తున్నారని ఆరోపించింది. రౌడీ షీటర్లకు సుపారీ ఇచ్చి తమను హత్య చేయించేందుకు కుట్ర పన్నుతున్నారని అనుమానంగా ఉందని చెప్పింది. తమ ఇద్దరికీ ఏక్షణంలో ఎలాంటి హాని జరుగుతుందో తెలియడం లేదని, అందుకే మీడియా ముందుకు వచ్చామని ఆమె పేర్కొంది. నిత్యం ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నామని దీప్తి చెప్పింది.