ఆజాద్ అడుగులు 'ఆజాదీ'గా పడ్డాయి. కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ సోమవారం తన కొత్త రాజకీయ పార్టీ 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ'ని ప్రకటించి, తన పార్టీ జెండాను కూడా విడుదల చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్‌తో తెగతెంపులు చేసుకున్న నెల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. విలేఖరుల సమావేశంలో ఈ మేరకు ఆయన తన పార్టీ విధివిధానాలను ప్రకటించారు. "స్థానిక మరియు జాతీయ మీడియాకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మాకు స్వతంత్ర ఆలోచన.. భావజాలం ఉంటుంది.. మా కొత్త పార్టీ ప్రజాస్వామ్య పార్టీ అవుతుంది. మేము ఆర్టికల్ 370ను ఎన్నికల సమస్యగా చేయము." అంటూ ఆజాద్ బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లమన్న సంకేతాన్ని మొదట్లో ఇచ్చాడు..
"మా పార్టీని నమోదు చేయడమే మా ప్రాధాన్యత. ఎన్నికలు ఎప్పుడైనా జరగవచ్చు. మేము మా రాజకీయ కార్యకలాపాలను కొనసాగిస్తాము" అని గులాంనబీ చెప్పారు. ఆజాద్ పార్టీ జెండా రంగులు 'నీలం, తెలుపు మరియు పసుపు.'గా రూపొందించాడు. "నా కొత్త పార్టీ కోసం దాదాపు 1,500 మంది పేర్లు ఉర్దూ, సంస్కృతంలో మాకు పంపబడ్డాయి. హిందీ & ఉర్దూ కలయికలో 'హిందూస్థానీ'. పేరు ప్రజాస్వామ్యంగా, శాంతియుతంగా మరియు స్వతంత్రంగా ఉండాలని మేము కోరుకుంటున్నాము" అని జమ్మూలో ఆజాద్ అన్నారు.
గులాం నబీ ఆజాద్ తన కొత్త రాజకీయ పార్టీని ఆవిష్కరించేందుకు ఈరోజు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆదివారం ఆయన కార్యకర్తలు, నాయకులతో సమావేశమయ్యారు. మా రాజకీయాలు కులం లేదా మతం ఆధారంగా ఉండవని స్పష్టం చేశారు. కొత్త పార్టీ పెట్టేందుకు మరే ఇతర పార్టీని సంప్రదించలేదని, నా పార్టీకి గాంధీజీ సిద్ధాంతం ఉంటుందని ఆయన అన్నారు.
అంతకుముందు, ఆజాద్, కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన తర్వాత జమ్మూలో తన మొదటి బహిరంగ సభలో పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణపై దృష్టి సారిస్తానని మాట ఇచ్చి.. ఇందుకోసం కొత్త సొంత రాజకీయ సంస్థను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
73 ఏళ్ల ఆజాద్ ఆగస్టు 26న కాంగ్రెస్‌ను విడిచిపెట్టారు. పార్టీ "సమగ్రంగా నాశనం చేయబడింది" అని పేర్కొంటూ రాహుల్ గాంధీ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. పార్టీ సంప్రదింపుల యంత్రాంగాన్ని మొత్తం కూల్చివేశారని రాహుల్ గాంధీపై ఆయన మండిపడ్డారు.
సోనియా గాంధీకి తన రాజీనామా లేఖలో, అతను గత తొమ్మిదేళ్లలో పార్టీని నడిపిన తీరుపై పార్టీ నాయకత్వాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నాడు. తాజాగా కొత్త పార్టీ పెట్టి తన అడుగులు బీజేపీకి సాన్నిహిత్యంగా ఉండేలా చూసుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.