ముఖేశ్ ను దాటేసిన అదానీ..: టాప్ టెన్లో గౌతమ్

Update: 2022-04-03 07:32 GMT
ఒకప్పుడు భారత కుభేరుడు అంటే ఎవరు..? ముఖేశ్ అంబానీ అని ఎవరైనా చెప్పేవారు. కానీ ఇప్పుడు ముఖేశ్ అంబానీని మించిన ధనవంతుడు మరో వ్యక్తిగా నిలిచారు. ఆయనే గౌతమ్ అదాని. చాలా ఏళ్లుగా నెంబర్ వన్ ప్లేను ఆక్రమించిన అంబానీ ఫ్యామిలీని అదానీ గ్రూప్ సంస్థలు దాటేసి పోతున్నాయి. ముఖేశ్ కు మించిన సంపదను సృష్టించి మొదటి అపర కుభేరుడిగా నిలుస్తున్నాడు గౌతమ్ అదాని. తాజాగా బ్లూంబర్గ్ తాజాగా ప్రకటించిన ఐశ్ర్యవంతుల జాబితాలోనే అదానీ వంద బిలియన్ డాలర్ల మార్కును దాటేశాడు.

అతి చిన్న కమొడిటీస్ ట్రేడింగ్ బిజినెస్ నుంచి ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా పేరు తెచ్చుకున్నాడు అదానీ. స్పోర్ట్స్, మైన్స్, గ్రీన్ ఎనర్జీ ఇలా పలు రంగాల్లో వ్యాపారాలను విస్తరించుకుంటూ  ముఖేశ్ అంబానీని దాటిపోయాడు. ఇటీవల సౌదీ ఆరామ్ కోతో సైతం అదానీ జట్టు కట్టారు.

అన్నింటికి మించి రెండు నెలలుగా అదాని గ్రూపునకు చెందిన కుకింగ్ ఆయిల్ విల్మర్ కంపెనీ షేర్లు 13 శాతం పెరిగాయి. ఉక్రెయిన్ యుద్ధంతో ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఏర్పడడం అదానికి కలిసొచ్చింది. ఇలా తన సంపదను అంతకంతకు సృష్టించుకుపోతూ 100 బిలియన్ డాలర్ల క్లబ్లోకి చేరాడు.

100 బిలియన్ డాలర్ల కబ్ లోకి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా మైక్రోసాప్ట్ అధినేత బిల్ గేట్స్ చేరారు. ఆ తరువాత వారెన్ బఫెట్ ఈ జాబితాలో చోటు సంపాదించాడు. ప్రస్తుతం ఎలన్ మస్క్ 270 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుడిగా ఉండగా.. గౌతమ్ అదానీ 100 బిలియన్ డాలర్లతో 10వ స్థానంలో,  99 బిలియన్ డాలర్లతో ముఖేశ్ అంబానీ 11వ స్థానంలో ఉన్నారు. దీంతో గత కొన్నేళ్లుగా భారత కుభేరుడిగా పిలుచుకుంటున్న ముఖేశ్ అంబానీ ప్లేసును గౌతమ్ అదానీ దాటేశాడు.

ఇక ఈ ఏడాది కరోనా కారణంగా చాలా వ్యాపారాలు దెబ్బతింటుండగా అదానీ మాత్రం 21.1 బిలియన్ డాలర్లు ఆర్జించాడని బ్లూంబర్గ్ సంస్థ గతంలో ప్రకటించింది. ఇది అంబానీ వార్షికాదాయం కంటే ఎక్కువే కావడం విశేషం. అప్పటి నుంచి అదాని ముఖే ష్ ను దాటేస్తూ వస్తున్నాడు. ఇలా అంచెలంచెలుగా ఎదిగి ఆసియా కుభేరుడిగా మారే అవకాశాలున్నాయని పలువురు వ్యాపార వేత్తలు అంటున్నారు. కాగా ముఖేశ్ అంబానీ తన తండ్రి సంపదను రెట్టింపు చేయగా అదాని మాత్రం సొంతంగా ఎదగడం విశేషం.
Tags:    

Similar News