ఖతర్నాక్ కోడలు.. చేసిన పని తెలిస్తే నోటి వెంట మాట రాదంతే

Update: 2022-09-20 23:30 GMT
మానవ సంబంధాలు రోజు రోజుకీ తగ్గిపోవటమే కాదు.. సరికొత్త సందేహాలకు అస్కారం ఇచ్చే పరిస్తితి. కలలో కూడా ఊహించని దుర్మార్గపు ఘటనలు ఈ మధ్యన ఎక్కువ కావటం తెలిసిందే. భార్యను భర్త చంపటం.. భర్తను భార్య ఏసేయటం.. తల్లిదండ్రుల్ని వారి సంతానం.. అత్తమామల్ని కోడలు ఇలా ఎప్పుడూ లేనన్ని సరికొత్త దారుణాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇలాంటి దారుణ ఘటనలకు మించిన మరో దారుణం ఒకటి తాజాగా దేశ రాజధానిలో వెలుగు చూసింది.

ఈ ఉదంతం గురించి తెలిస్తే.. ఇలాంటి ఖతర్నాక్ కోడలు కూడా ఉంటారా? అంటూ షాక్ కు గురి కాక మానదు. ఢిల్లీలోని లక్ష్మీనగర్ కు చెందిన ఒక ఆభరణాల వ్యాపారికి భార్యతో నాలుగేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. ఇద్దరూ ఒకే ఇంట్లో కలిసి ఉన్నా.. వేర్వేరు గదుల్లో ఉంటున్నారు. ఇదిలా ఉంటే.. తన భార్యకు తన స్నేహితుడితో అక్రమ సంబంధం ఉందన్న విషయాన్ని భర్త ఈ మధ్యనే గుర్తించాడు.

తమ బండారం బయటకు రావటంతో ఇంట్లో ఉన్న కోటి రూపాయిలు విలువ చేసే ఆభరణాల్ని తీసుకొని ప్రియుడితో కలిసి భార్య జంప్ అయ్యింది. దీంతో.. భర్త పోలీసుల్ని ఆశ్రయించాడు. తమకు ఎదురైన మోసాన్ని ఆయన కంప్లైంట్ రూపంలో పోలీసులకు ఇచ్చాడు.

ఇక్కడే.. ఈ ఎపిసోడ్ లో అనూహ్యమైన ట్విస్టు తెర మీదకు వచ్చింది. తన మీద పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని భార్య భర్తకు బెదిరింపులు షురూ చేసింది.

తన మాట విని ఫిర్యాదు తీసుకుంటే సరి అని.. లేదంటే ఇంట్లో ఉన్న వేళలో భర్త తల్లిదండ్రులైన అత్తమామల గదిలో తాను సీక్రెట్ కెమేరా పెట్టి.. వారి నగ్న వీడియోల్ని తీసిన విషయాన్ని చెప్పి.. తన మాట వినకుంటే ఆ వీడియోల్ని సోషల్ మీడియాలో బయటపెడతానని బెదిరించింది.

దీంతో.. షాక్ తిన్న భర్త.. మరో ఆలోచన లేకుండా ఈ బెదిరింపునకు సంబంధించిన ఫిర్యాదును పోలీసులకు ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఈ కిలాడీ కోడల్ని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News