వూహాన్ ల్యాబ్ లీక్ పై అమెరికా మరో బాంబు

Update: 2021-05-31 17:30 GMT
ప్రపంచంలో కరోనా ప్రబలడానికి కారణం చైనానే అని ఆరోపణలున్నాయి. ఇటీవల చైనాలోని వూహాన్ నుంచే కరోనా సృష్టించబడిందని బ్రిటన్, నార్వే, అమెరికాలు ఆరోపించాయి. వైరస్ వ్యాప్తికి మూలంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న చైనాలో వూహాన్ ల్యాబ్ లో ఆ దేశ సైన్యం రహస్య కార్యకలాపాలు నిర్వహించిందని తాజాగా వెల్లడికావడం కలకలం రేపుతోంది.

కరోనాను చైనా ఒక జీవాయుధంగా ప్రపంచం మీదికి ప్రయోగించిందనే ఆరోపణలున్నాయి. చైనాలో రెండో వేవ్ తలెత్తకపోవడం.. వూహాన్ ల్యాబ్ లో పనిచేసే పరిశోధకులకు 2019 నవంబర్ కన్నా ముందే వైరస్ సోకినట్లు ఇటీవల వాల్ స్ట్రీట్ జర్నల్ సంచలన కథనం రాయడం.. ఆ వెంటనే అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ కరోనా మూలాలను కనిపెట్టాల్సిందిగా ఇంటెలిజెన్స్ ను ఆదేశించడం తెలిసిందే.

ట్రంప్ హయాంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన మైక్ పాంపియో.. వూహాన్ ల్యాబ్ లీకేజీతో చైనీస్ ఆర్మీతో లింకులున్నాయంటూ తాజాగా బాంబు పేల్చారు. వూహాన్ వైరాలజీ ల్యాబ్ లో జరిగిన రహస్య పరిశోధనల్లో చైనీస్ ఆర్మీ 'పీఎల్ఏ' కూడా పాలుపంచుకుందని.. ల్యాబ్ టెస్టుల్లో సైనికులు కూడా భాగస్వాములయ్యారని ..వైరస్ పరిశోధనలతోపాటు సైనిక కార్యకలాపాలు కూడా రహస్యంగా సాగాయని మైక్ పాంపియో సంచలన వ్యాఖ్యలు చేశారు.

కరోనా మహమ్మారి ఎలా పుట్టిందో తెలియకుండా భవిష్యత్తులో సంభవించే వ్యాధులను పసిగట్టలేమని.. కోవిడ్19 మూలాలను కనిపెట్టకపోతే కోవిడ్26, కోవిడ్32 వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు అని టెక్సాస్ నిపుణులు వెల్లడించారు.
Tags:    

Similar News