చైనాకు మరో షాక్.. ఈసారి యాపిల్

Update: 2020-08-02 09:30 GMT
మూలిగేనక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది చైనా పరిస్థితి. భారత్ తో కయ్యానికి కాలుదువ్వడంతో మన దేశం ఏకంగా 59 చైనా యాప్స్ పై నిషేధం విధించి ఆర్థికంగా దెబ్బతీసింది. పలు కాంట్రాక్టులను రద్దు చేసింది.

తాజాగా టెక్నాలజీ దిగ్గజం యాపిల్ సంస్థ కూడా చైనాకు భారీ షాక్ ఇచ్చింది. తన యాప్ స్టోర్ నుంచి ఏకంగా 29,800 చైనీస్ యాప్స్ ను తొలగించింది. వీటిల్లో 26వేలకు పైగా యాప్స్ గేమ్స్ కు చెందినవి కావడం విశేషం. ఈ గేమింగ్ పేరుతో వ్యక్తుల డేటా చోరీ చేస్తోందని ఆ సంస్థపై ఆరోపణలున్నాయి.

గత ఏడాది యాపిల్ సంస్థ గేమింగ్ యాప్స్  రూపొందించే సంస్థలకు ప్రభుత్వం జారీ చేసిన లైసెన్స్ లు సమర్పించాలని కోరింది. దీనికి డెడ్ లైన్ ను జూన్ వరకు పెట్టింది. వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో తాజాగా యాపిల్ తన ప్లేస్టోర్ నుంచి ఈ 29వేల చైనీస్ యాప్స్ ను తొలగించింది.

ఇక గత నెల మొదటి వారంలోనే సుమారు 2500కు పైగా యాప్స్ను యాపిల్ సంస్థ తొలగించింది. అటు అమెరికా కూడా టిక్ టాక్ తోపాటు పలు చైనా యాప్ లను బ్యాన్ చేయడానికి సిద్దమైంది. ఇలా చైనాకు ప్రపంచవ్యాప్తంగా గడ్డు కాలం ఎదురుకాబోతోంది.
Tags:    

Similar News