శ్రీవారి ఆలయం ముందు మరోసారి ఫోటోషూట్... వాట్ నెక్స్ట్?

అవును... ఇకపై తిరుమల శ్రీవారి ఆలయం పరిశరాల్లో రాజకీయ ప్రసంగాలు, ఫోటో షూట్ లు, రీల్స్ వంటివాటిని అనుమతి లేదనే చర్చ నడుస్తున్న వేళ తాజాగా మరో ఘటన తెరపైకి వచ్చింది.

Update: 2024-11-28 12:56 GMT

ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఛైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా... తిరుమలలో రజకీయ ప్రకటనలు చేయడం పూర్తిగా నిషేధిస్తామని అన్నారు.

 

ఇదే సమయంలో... ఇప్పటికే పవిత్రమైన కొండపై ఫోటో షూట్ లు, సోషల్ మీడియా రీల్స్ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీసులు పలువురిపై కేసులు నమోదు చేసినట్లు కథనాలొచ్చాయి. ఈ నేపథ్యంలో మరోసారి తిరుమల కొండపై ఫోటో షూట్ వ్యవహారం తెరపైకి వచ్చింది.

అవును... ఇకపై తిరుమల శ్రీవారి ఆలయం పరిశరాల్లో రాజకీయ ప్రసంగాలు, ఫోటో షూట్ లు, రీల్స్ వంటివాటిని అనుమతి లేదనే చర్చ నడుస్తున్న వేళ తాజాగా మరో ఘటన తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా... తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు వంశీధర్ రెడ్డి హల్ చల్ చేశారు.

ఇందులో భాగంగా నలుగురు వ్యక్తిగత ఫోటోగ్రాఫర్లతో ఆలయ ప్రాంగణంలో ఫోటోషూట్ నిర్వహించారు. ఇంత జరుగుతున్నా తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ సిబ్బంధి పట్టించుకోలేదని అంటున్నారు. మరోపక్క ఈ వ్యవహారంపై పలువురు భక్తులు అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది.

మరోవైపు ఈ వ్యవహారాన్ని షూట్ చేస్తున్న మీడియాపైనా ఆయన వ్యక్తిగత సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన పరిస్థితి. వాస్తవానికి గతంలో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పలువురు నేతలపై

Tags:    

Similar News