తెలంగాణలో మరో సర్వే: ఈసారి గెలుపు ఎవరిదంటే?

Update: 2022-07-15 09:30 GMT
తెలంగాణ సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు తొడగొట్టినప్పుడే 'సమ్ థింగ్ రాంగ్' అని అందరూ అనుకున్నారు. తెరవెనుక ఏదో జరుగుతోందని అనుమానించారు.అందరూ అనుమానించినట్టే వరుసగా సర్వేలు జరుగుతున్నాయి. మెజార్టీ సర్వేల్లో గులాబీదే విజయం అని.. బీజేపీ గట్టి పోటీనిస్తుందని తేలింది. దీంతో సమరోత్సాహంతోనే కేసీఆర్ ఇలా చేస్తున్నాడని అంటున్నాడని అంటున్నారు.

ఇప్పటికే పీకే టీంతో సర్వే చేయించుకున్న కేసీఆర్.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని.. వారిని మారిస్తే సరిపోతుందని అనుకుంటున్నట్టు తెలిసింది. తాజాగా రెండు రోజుల క్రితం 'ఆరా' సర్వే విడుదలైంది. ఇందులో టీఆర్ఎస్ కు ఓట్ల శాతం తగ్గినా కూడా ఆపార్టీకే మెజార్టీ వస్తుందని తేల్చింది.ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు నిర్వహిస్తే 38.88 శాతం ఓట్లు వస్తాయని తేలింది. ఇక గట్టి పోటీనిస్తున్న బీజేపీకి 30.48 శాతం ఓట్లు, ప్రతిపక్ష కాంగ్రెస్ కు కేవలం 23.71 శాతం ఓట్లు వస్తాయని తేలింది.

గత 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే టీఆర్ఎస్ కు 46.87 శాతం ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 38.88 శాతానికి పడిపోయింది. మూడేళ్లలో టీఆర్ఎస్ కు దాదాపు 8శాతం ఓటు బ్యాంకు తగ్గింది. ఇక ఇదే సమయంలో 2018లో కేవలం 6.98 ఓట్లశాతం తెచ్చుకున్న బీజేపీ ఇప్పుడు ఏకంగా 30.48 శాతానికి ఎగబాకింది.

ఆరా సర్వేలో తెలంగాణలో టీఆర్ఎస్ దే విజయం అని..కానీ బీజేపీ ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగిందని తేలింది. అయితే ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయన్నది మాత్రం అందులో వెల్లడించలేదు. టీఆర్ఎస్ దే గెలుపు అని మాత్రం అర్థమైంది.

ఇక 'ఆరా' సర్వే ప్రకంపనలు ముగియకముందే.. ఇప్పుడు 'ఆత్మసాక్షి' సర్వే విడుదలైంది. ఇందులో టీఆర్ఎస్ కు 39.5 శాతం ఓట్లతో 56-59 స్థానాలు రానున్నాయి. కాంగ్రెస్ కు 31.5 శాతం ఓట్లతో 37-39 సీట్లు వస్తాయని తేలింది. బీజేపీకి 21 శాతం ఓట్లు,  14-16 దాకా సీట్లు వస్తాయని వెల్లడైంది.  పలు జిల్లాల్లో టీఆర్ఎస్-కాంగ్రెస్ ల మధ్యనే పోటీ ఉంటుందని తేలింది.కొన్ని జిల్లాల్లో మాత్రం మూడు పార్టీల మధ్య పోరు ఉంటుందని తేలింది. దాదాపు 1.88 లక్షల శాంపిళ్లను తీసుకున్నట్టు ఆత్మసాక్షి తెలిపింది.

రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ కే పట్టం 'ఆత్మసాక్షి' గ్రూప్ త‌న సర్వే వివ‌రాల‌ను ప్రకటించింది. రానున్న ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్‌దే గెలుపని ఆ సర్వేలో వెల్ల‌డైంది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం..తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మరీ విఫలమవతోన్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి కూడా నిరాశ తప్పదని సంస్థ సర్వే వెల్లడించింది. ఇది ఒకరకంగా కాంగ్రెస్ పార్టీకి షాక్ లాంటిదే.

మొత్తంగా ప్రస్తుతం ఎన్నికలు వస్తే టీఆర్ఎస్ దే విజయం అని స్పష్టమైంది. దీంతోనే కేసీఆర్ కేంద్రంపై తొడగొడుతున్నాడని తెలుస్తోంది. ఆయన ఊపుకు ఇదే కారణం అంటున్నారు. మరి ఈ సర్వేలు ఎంత వరకూ నిజమన్నది వేచిచూడాలి. మరో రెండేళ్లు టైం ఉండడంతో అప్పటివరకూ సమీకరణాలు ఖచ్చితంగా మారుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
Tags:    

Similar News