తప్పిపోయిన కరోనా పేషేంట్ దొరికాడు..కానీ..!

Update: 2020-04-18 13:00 GMT
కరోనా మహమ్మారి దేశ వ్యాప్తంగా వేగంగా విజృంభిస్తుంది. అయితే , కరోనా సోకిన వారికీ వైద్యలు ప్రాణాలకి తెగించి చికిత్స అందిస్తుంటే ..కొంతమంది ఐసోలేషన్ వార్డ్ లో ఉండలేక హాస్పిటల్ నుండి పారిపోతున్నారు. ఈ మద్యే యూపీలో లోక్‌ నాయ‌క్ జ‌య‌ప్ర‌కాశ్ నారాయ‌న్ ఆసుపత్రి నుంచి ఒక కరోనా పేషేంట్ పారిపోయాడు. అయితే, కరోనా బాధితుడిని అయితే పోలీసులకు పట్టుకున్నారు. కానీ, అతను ఎక్కడెక్కడ తిరిగాడు ? ఎవర్ని కలిశాడు ? అతని నుండి ఎవరికైనా కరోనా సోకిందా అనేది తెలుసుకోవడం ఇప్పుడు కష్టంగా మారింది.

ఈ ఘటన పై పూర్తి వివరాలు చూస్తే ... ఢిల్లీలోని నిజాముద్దీన్‌ మర్కజ్‌ కి వెళ్ళి రావటంతో అతడికి కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయ్యింది. దీనితో యూపీ సర్కార్ అతనిని ప్రభుత్వాస్పత్రిలో చేర్చి ఐసోలేషన్ వార్డులో ఉంచి కరోనా కి చికిత్స అందిస్తుంది. ఈ తరుణంలో గత సోమవారం రాత్రి తన బట్టలను తాడుగా మార్చి ఆస్పత్రి వార్డులోని కిటికీని బద్దలు కొట్టి పారిపోయాడు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న అధికారులు .. అతని కోసం సమీప గ్రామాల్లో గాలింపు చేపట్టగా శ‌నివారం హర్యానా రాష్ట్రంలోని రాయ్ గ్రామం వద్ద కనిపించాడు. దీంతో ఢిల్లీ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి - తిరిగి ఆసుపత్రిలో చేర్చారు.

అయితే , పారిపోయిన కరోనా పేషేంట్ ను అయితే పోలీసులు పట్టుకున్నారు. కానీ ,ఇక్కడే పోలీసులకి మరో సమస్య ఎదురైంది. అదేమిటి అంటే కరోనా పేషేంట్ ఆసుపత్రి నుండి పారిపోయిన తరువాత ఎవరిని కలిశాడు అనేది ఇప్పుడు ఒక ప్రశ్నగా మారింది. ప్ర‌స్తుతం ఇదే అంశంపై ద‌ర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. ఇక అతను ఎంత మందికి కరోనా వ్యాప్తి అయ్యేలా చేస్తాడో అని ఆందోళన చెందుతున్నారు.



Tags:    

Similar News