కృష్ణా జలాల వివాదం మరో మలుపు తిరిగింది. ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మధ్య మొదలైన ఈ నీటి యుద్ధం విషయంలో ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా రైతులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 28న తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ వేశారు. పిటీషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై మధ్యాహ్నం 2.30 గంటలకు విచారణ చేపట్టింది.
శ్రీశైలం , నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టుల్లో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి చేయడంపై ఏపీలోని కృష్ణా జిల్లా రైతులు దాఖలు చేసిన పిటీషన్ ను తెలంగాణ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది.
'అంతర్రాష్ట్ర జల వివాదాల్లో కోర్టులు జోక్యం చేసుకోవచ్చా?' అనే అంశంపై రేపు వాదనలు వినిపించాలని, ఏపీ, తెలంగాణ కేంద్ర ప్రభుత్వాలను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.అంతకుముందు కృష్ణా జిల్లా రైతులు 'తెలంగాణ ప్రభుత్వం జీవోనెంబర్ 34ను విడుదల చేసి విద్యుత్ ఉత్పత్తికి నీటిని అక్రమంగా తరలిస్తోందని' పిటీషన్ ఆరోపించారు. వెంటనే జీవోను కొట్టేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
ఇప్పటికే కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా కింద వచ్చే జలాల్లో ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని తెలంగాణ సర్కార్ తేల్చి చెబుతోంది. అలాగే తాము జలవిద్యుత్ ఉత్పత్తిని కూడా ఆపబోమని.. ఆంధ్రప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులు చేపట్టిందని అంటోంది.
తెలంగాణ బీజేపీ సైతం ఈ వివాదంపై స్పందించింది. తెలంగాణ వాటాను రక్షించాలంటే కేఆర్ఎంబీ పరిధి నోటిఫై చేయాల్సిందేనని బండి సంజయ్ స్పష్టం చేశారు. ఇందుకోసం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ కు బండి సంజయ్ లేఖ రాశారు. జగన్, కేసీఆర్ ఇద్దరు సెంటిమెంట్ ను రెచ్చగొట్టాలని చూస్తున్నారని.. హక్కులను కాపాడాలని పనిచేయడం లేదని ఆరోపించారు.