దివ్య హత్య కేసులో మరో ట్విస్ట్ ...ఆర్య సమాజ్ లో పెళ్లి .. అసలేం జరిగిందంటే !
సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బ్యాంకు ఉద్యోగిని దివ్య హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోలిసుల ప్రాథమిక అంచనా ప్రకారం దివ్య హత్య పక్కా ప్లాన్ తోనే చేసినట్టు భావిస్తున్నారు. రెక్కీ నిర్వహించిన తర్వాతే దివ్య హత్య జరిగిందని అనుమానిస్తున్నారు. వెంకటేశ్ హత్య చేసి ఉండడని అతని తండ్రి పరుశురాం చెబుతున్నప్పటికీ.. పోలీసులకు మాత్రం అతని పైనే అనుమానం కలుగుతోంది. సంచలనం రేకెత్తించిన ఈ హత్య కేసులో పూర్వ పరాలపై పోలీసులు మరింత లోతుగా దృష్టి సారించారు. వేములవాడ పోలీస్ స్టేషన్ లో నేనే దివ్య ని హత్య చేశాను అని లొంగిపోయిన నుండి అసలు ఏంజరిగిందో చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు.
దివ్య వేములవాడలోని ఓ ప్రైవేట్ స్కూల్లో చదివేది. అదే స్కూల్లో వెంకటేశ్ కూడా చదివేవాడు. ఇద్దరూ ఒకే క్లాస్ కావడంతో దివ్యకు దగ్గరవడానికి వెంకటేశ్ ప్రయత్నించేవాడు. ఈ క్రమంలో ఆమెను ప్రేమ పేరుతో వేధించానేది దివ్య తల్లిదండ్రులు ఆరోపణలు చేస్తున్నారు. స్కూలింగ్ అయిపోయి ఇంటర్మీడియట్ లో చేరాక కూడా వెంకటేశ్ వేధింపులు ఆగలేదని దివ్య తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై అప్పట్లో వేములవాడ, ఎల్లారెడ్డిపేట పోలీస్ స్టేషన్ల లో ఫిర్యాదు కూడా చేశామని చెబుతున్నారు. దివ్య తన ప్రేమను నిరాకరిస్తోందన్న కారణంతో వెంకటేశ్ ఓసారి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య కు కూడా యత్నించాడని చెప్పారు. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులు తమ ఇంటి పైకి దాడికి వచ్చారన్నారు. దీంతో వేములవాడలో ఉండటం ఇష్టం లేక హైదరాబాద్ వెళ్లిపోయామని.. అక్కడే తమ కుమార్తె ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి గ్రామీణ వికాస్ బ్యాంకు లో ఉద్యోగం సాధించిందని చెప్పారు.
ఉద్యోగం వచ్చాక దివ్యకు సంబంధాలు చూడటం మొదలుపెట్టిన తల్లిదండ్రులు వరంగల్‌కు చెందిన సందీప్‌తో ఇటీవలే పెళ్లి కుదిర్చారు. నెల 26న పెళ్లి జరగాల్సి ఉంది. అయితే దివ్య మరొకరిని పెళ్లి చేసుకుంటుందన్న కక్షతో వెంకటేశ్ ఆమెను హత్య చేసేందుకు ప్లాన్ చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. వెంకటేశ్‌ను పట్టుకునేందుకు సిద్దిపేట పోలీసులు రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వేములవాడ లోని అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలిసిన వెంకటేశ్.. పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. దీంతో అతన్ని అరెస్ట్ చేసిన వేములవాడ పోలీసులు సిద్దిపేట పోలీసులకు అప్పగించారు. గురువారం అతన్ని కోర్టులో హాజరుపరిచి.. కస్టడీ కోరే అవకాశం ఉంది
అయితే , ఎల్లారెడ్డిపేటలో పాఠశాలలో చదువుకుంటున్న సమయంలోనే వారి మధ్య చనువు పెరిగిందని , ఉస్మానియా యూనివర్సిటీ లో చదివే సమయం లో దివ్యను వెంకటేశ్ ఆర్య సమాజ్ లో ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. కులాలు వేరు కావడం తో ఈ పెళ్లికి దివ్య తల్లిదండ్రులు అంగీకరించ లేదు అని ,ఆ తర్వాత దివ్యను పుట్టింటికి తీసుకెళ్లి ఆమె మనసు మార్చారని వెంకటేశ్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.తన కుమారుడు చాలా పిరికి వాడని, అతనికి హత్య చేసేంత ధైర్యం లేదని వెంకటేష్ తండ్రి చెప్తున్నాడు.