మహమ్మారి పై యాంటీ బయోటిక్స్.. ఏం తేలింది?
యాంటీబయోటిక్స్ అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పనిచేస్తాయి. అవి వైరస్‌లపై పనిచేయవు. ఇది అందరికీ తెలిసిన ప్రాథమిక విషయం. ఐతే కరోనా వైరస్‌ను తగ్గించడానికి పలు రకాల యాంటీ బయోటిక్స్ వాడుతున్న సంగతి తెలిసిందే. మరి వైరస్‌ల మీద యాంటీ బయోటిక్స్ పని చేస్తాయా అన్న సందేహం కలగడం సహజం. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక అధ్యయనం జరిపి.. కరోనా బాధితులకు యాంటీ బయోటిక్స్ ఇవ్వడంపై వివరణ ఇచ్చింది. దీని ప్రకారం యాంటీ బయోటిక్స్ నేరుగా వైరస్ మీద పని చేయవు. ఐతే కరోనా వల్ల కలిగే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు తగ్గడానికి యాంటీబయోటిక్స్ పని చేస్తాయి.
అజిత్రో మైసిన్ అనేది ఓ యాంటీబయోటిక్. దీన్ని ప్రస్తుతం కొవిడ్-19 ట్రీట్ మెంట్లో వాడుతున్నారు. ఈ డ్రగ్ యాంటీ ఇన్‌ఫ్లేమేటరీ ఎఫెక్ట్స్ కోసం వాడుతున్నారు. అలాగే రోగనిరోధక శక్తిని పెంచి కొవిడ్ 19 ప్రభావాన్ని తగ్గించడానికి కూడా ఉపయోగ పడుతుంది.. హైడ్రాక్సీక్లోరిక్విన్, అజిత్రో మైసిన్ కలిపి యాంటీ మలేరియా డ్రగ్ గా వాడతారన్న సంగతి తెలిసిందే. స్థూలంగా చెప్పాలంటే యాంటీ బయోటిక్స్ కరోనా వల్ల కలిగే సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల పైన మాత్రమే పని చేయగలవు. ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కోవిడ్-19 చికిత్సకు ఎలాంటి డ్రగ్‌నూ అధికారికం గా ధ్రువీకరించ లేదు. కేవలం రోగ నిరోధక శక్తిని పెంచడానికి మాత్రమే మందులు ఇస్తున్నారు.