పగిలితే అతకదంటారు. కానీ.. మనసు పెడితే అదేమీ అసాధ్యం కాదు. గాఢంగా ప్రేమించుకొని బయటకు రాని కారణంతో కటీఫ్ అయిన క్రికెటర్ విరాట్ కోహ్లీ.. బాలీవుడ్ భామ అనుష్కశర్మల మధ్య మళ్లీ బంధం బలపడుతుందా? అంటే అవుననే మాట వినిపిస్తోంది. తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు దీనికి బలాన్ని ఇస్తున్నాయి. అనుష్కతో కటీఫ్ అయిన తర్వాత ఆమెకు దగ్గరయ్యేందుకు కోహ్లీ ప్రయత్నించటం.. దీనికి అనుష్క సైతం పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఆ మధ్యన ఒక కార్యక్రమానికి వెళ్లి.. బాలీవుడ్ పాట పాడటం ద్వారా కోహ్లీ.. అనుష్క పట్ల తనకున్న ప్రేమను బాహాటంగా ప్రదర్శించే ప్రయత్నం చేయటం.. దానికి ప్రతిగా అన్నట్లు.. పాక్ మీద గెలిచిన మ్యాచ్ సందర్భంగా కోహ్లీకి అనుష్క ఫోన్ చేసి అభినందించటం జరిగిపోయాయి. నాటి నుంచి ఒకరికొకరు టచ్ లోకి వెళుతూ.. తమ బ్రేకప్ అయిన బంధానికి రిపేర్ చేసుకునే పని మొదలుపెట్టారు.
ఇందులో భాగంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేక సందేశాన్ని పోస్ట్ చేసిన కోహ్లీ.. దేశంలో జరుగుతున్న అత్యాచారాలు.. చిన్నారులపై వివక్ష పెరుగుతుందన్న ఆవేదన వ్యక్తం చేస్తూ.. ‘‘సారీ’’ అంటూ శుభాకాంక్షలు చెప్పి అందరి మనసుల్ని దోచుకున్నాడు. పనిలో పనిగా అనుష్కను కూడా అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదేమో. కోహ్లీ చేస్తున్న పనులకు తాజాగా అనుష్క సానుకూలంగా స్పందించటమే కాదు.. తమ మధ్య పెరిగిన దూరాన్ని తగ్గించుకునేందుకు వీలుగా మూడు రోజులు షూటింగ్ కు బ్రేక్ తీసుకొని రిపేర్ చేసుకునేందుకు రెఢీ అయ్యిందని చెబుతున్నారు. ఇందులో భాగంగానే సుల్తాన్ షూటింగ్ కు మూడురోజులు రాలేనని చెప్పినట్లు తెలుస్తోంది. మరి.. ఈ బ్రేకప్ జంట ప్రేమపక్షులుగా మారిపోతారా? లేదా? అన్నది త్వరలో జరిగే టీ 20 వరల్డ్ కప్ కు అనుష్క హాజరుతో తేలిపోతుందంటున్నారు. మరి.. మూడు రోజుల రిపేర్ తో ప్రేమ పక్షులు కలుస్తాయా?