ఆంధ్రప్రదేశ్ లో కరోనా మహమ్మారి విజృంభణ తారస్థాయికి చేరింది. వారం కిందటి వరకు 15 వేల లోపే ఉన్న కేసుల సంఖ్య.. ఒకే సారి 20 వేలు దాటిపోయింది. దీంతో.. రాష్ట్రంలో అలజడి మొదలైంది. గడిచిన 24 గంటల్లో ఒక లక్ష 14 వేల 299 మందిని పరీక్షించగా.. 23,920 మందికి పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. 88 మందిప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది.
శనివారం నాటి రిపోర్టుల ప్రకారం ఒక్క రోజులో 19,412 కేసులు నమోదు కాగా.. ఇవాళ ఒకేసారి సుమారు 4 వేల కేసులు పెరిగిపోవడం గమనార్హం. శనివారం 61 మంది చనిపోయారు. దీంతో.. మొత్తం మరణాల సంఖ్య 8,136కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 1,43,178 ఉన్నాయి.
అటు దేశంలోనూ పరిస్థితి మరింత ఆందోళన కరంగా ఉంది. గడిచిన 24 గంటల్లో కేసులు 4 లక్షల 1 వెయ్యి పైచిలుకు నమోదయ్యాయి. మూడున్నర వేల మందికిపై ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి పరిస్థితుల్లో జనం ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకున్నారు.
కేసులు బీభత్సంగా పెరిగిపోతుండడంతో పలు రాష్ట్రాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి. తాజాగా.. ఒడిషాలో లాక్ డౌన్ అమలు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటించారు. ఢిల్లీలో మరో వారం పాటు పొడిగించారు. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం రాత్రి కర్ఫ్యూ అమలవుతోంది. ఏపీలో కేసులు వేగంగా పెరుగుతున్న దృష్ట్యా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఉత్కంఠ నెలకొంది.