తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి రెండు తెలుగు రాష్ట్రాల అధికారపక్షాలకు కన్నెర్రగా మారారు. ఇటీవల కాలంలో మరే నేతకు లేని పరిస్థితి రేవంత్ కు ఎదురవుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొంటున్న నాయకత్వ సమస్య రేవంత్ తో తీరుతుందని అధిష్ఠానం భావిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తగ్గట్లే తన ఎంట్రీతోనే మార్పులు తేవటంలో ఆయన సక్సెస్ కావటం తెలిసిందే. రేవంత్ ను టీపీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పజెప్పిన నాటి నుంచి తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త కళ కనిపిస్తోంది. దీనికి తోడు.. మొన్ననే నిర్వహించిన ఇంద్రవెల్లి సభ అధికార టీఆర్ఎస్ నేతలు సైతం అసూయ పడేలా మారిందన్న అభిప్రాయం పెద్ద ఎత్తున వ్యక్తమవుతోంది.
ఇలాంటి వేళ.. రేవంత్ నోటి నుంచి వచ్చిన కొన్ని వ్యాఖ్యలు తెలంగాణ అధికారపక్ష నేతల నుంచే కాదు..ఏపీ అధికారపక్ష నేతల నుంచి ఘాటు విమర్శల్ని ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయన్ను ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడుతూ.. ‘అతనో క్యారెక్టర్ లెస్ ఫెలో’ అని దుయ్యబట్టారు. ఎవరో ఏదో చెబితే రేవంత్ అది చేస్తాడన్న ఆయన కోపానికి కారణం.. ఏపీ రాజధాని మీద రేవంత్ చేసిన వ్యాఖ్యగా చెప్పాలి. ఆ మధ్యన ఏపీ రాజధాని అమరావతి గందరగోళంగా మారడం తెలంగాణవాదిగా సంతోషం కలిగిస్తోందని, కానీ, భారత పౌరుడిగా బాధగా ఉందని రేవంత్ రెడ్డి గతంలో వ్యాఖ్యానించిన వైనం ఏపీ అధికారపక్ష నేతలకు మండేలా చేసింది.
రేవంత్ కాంగ్రెస్ పార్టీ కాదని.. తెలగుకాంగ్రెస్ పార్టీగా ఆయన వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుఏం చెబితే అదే రేవంత్ చేస్తాడన్న ఆయన.. రేవంత్ కు తనకంటూ ఏ పార్టీ లేదన్నారు. రేవంత్ కు అమరావతి గురించి ఎందుకని ప్రశ్నించిన బాలినేని.. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ.. మరో పార్టీ అధినేత ఇష్టమని ఎలా వ్యాఖ్యానిస్తారని ప్రశ్నిస్తున్నారు. విశాఖపట్నం అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కాబట్టి.. అక్కడ రాజధాని పెట్టాలన్న నిర్ణయాన్ని తీసుకున్నామన్నారు. బాలినేనితో పాటు పలువురు వైసీపీ నేతలు రేవంత్ రెడ్డిని తిట్టిపోశారు.
ఓపక్క ఏపీ అధికారపక్ష నేతలు రేవంత్ తీరుపై మండిపడుతుంటే.. మరోవైపు తెలంగాణ రాష్ట్ర మంత్రులు.. టీఆర్ఎస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సీఎం కేసీఆర్ ను తిట్టటం ద్వారా శునకానందం పడుతున్నారంటూ తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తే.. రేవంత్ చరిత్రను మర్చిపోయి మాట్లాడుతున్నారని.. ఆయన తీరు చూస్తే జాలి కలిగిస్తుందని మండిపడ్డారు.
శవాల మీద పేలాలు ఏరుకునే తీరులోరోజుకో పార్టీని రేవంత్ మారుతున్నట్లుగా మండిపడ్డారు. ప్రజలు ఆయన్ను నమ్మరన్నారు. ఇంద్రవెల్లిలో దళితులపై జరిగిన దమనకాండను చరిత్ర మర్చిపోదన్న టీఆర్ఎస్ నేతలు.. 1981లో ఇంద్రవెల్లిలో ఆదివాసీ బిడ్డల్ని వందలాది మందిని పిట్టల్నికాల్చినట్లుగా కాల్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని.. అలాంటి పార్టీ ఈ రోజున స్మారకం ఎలా కడతారు? అని ప్రశ్నించారు. మొత్తంగా తన మాటలతో రెండు తెలుగు రాష్ట్రాల అధికారపక్ష నేతల చేత రేవంత్ చీవాట్లు తింటున్న పరిస్థితి నెలకొందన్న మాట వినిపిస్తోంది.