ఎంతకాదన్నా రాజకీయాలంటే కులాల లెక్కలే అన్నట్లుగా ఉంది ఏపీలో పరిస్థితి. ప్రధానంగా అధికారం కమ్మ, రెడ్డి కులాల మధ్యే ఉంటుండగా సంఖ్యాపరంగా ఎక్కువ ఉన్న తాము కూడా అధికారంలో ఉండాలని కాపులు ఆకాంక్షిస్తున్నారు. అన్నీ కలిసొస్తే 2024లో ఆంధ్రప్రదేశ్‌కు కాపు సీఎం రావాలని కోరుకుంటున్నారు.
2024 ఎన్నికల్లో ఏ కులం నుంచి సీఎం అవుతారో ఇప్పుడే చెప్పడం ఊహాగానమే అవుతుంది. అయితే... ఆయా కులాల నేతలు మాత్రం అందుకు తగ్గట్లుగా పావులు కదపడం, రాజకీయాలు చేయడం ఇప్పటి నుంచే ప్రారంభమవుతుంది.
ఇదంతా ఎలా ఉన్నా.... రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఏ కులం ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనేది మాత్రం ఆసక్తికరంగా ఉంది. జనాభాపరంగా తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ రెడ్డి, కమ్మ, కాపు కులాల నుంచే పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ రెండు కులాల తరువాత వెలమల నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఎస్సీ నియోజకవర్గాలు నిర్దిష్ట సంఖ్యలో ఉండడంతో అక్కడ ఆ వర్గం నుంచే గెలుస్తున్నారు.
ఏ కులం నుంచి ఎంతమంది అంటే...
రెడ్డి: ఈ కులం నుంచి 2014లో 40 మంది ఎమ్మెల్యేలుగా గెలవగా 2019 ఎలక్షన్లలో 48 మంది ఎన్నికయ్యారు.
కమ్మ: ఈ కులం వారు 2014లో 33 మంది ఏపీ అసెంబ్లీకి ఎన్నికవగా 2019లో 17 మంది ఎన్నికయ్యారు.
కాపు: ఈ కులం వారు 2014లో 17 మంది అసెంబ్లీకి ఎన్నికకాగా 2019 ఎన్నికలలో 24 మంది ఎన్నికయ్యారు.
ఎస్సీ: 29 రిజర్వ్‌డ్ నియోజకవర్గాల నుంచి 29 మంది.
ఎస్టీ: 7 రిజర్వ్‌డ్ నియజకవర్గాల నుంచి ఏడుగురు.
ముస్లింలు: 2014లో నలుగురు... 2019లో నలుగురు గెలిచారు.
వెలమ: ఈ కులం నుంచి 2014లో 9 మంది ఎమ్మెల్యేలుగా గెలవగా 2019లో వారి సంఖ్య 10కి పెరిగింది.
తూర్పు కాపు: 2014 ఎన్నికలలో ఈ కులం నుంచి 6గురు ఎమ్మెల్యేలుగా గెలిచారు. 2019 అసెంబ్లీ ఎలక్షన్లలో వీరి సంఖ్య 5కి తగ్గింది.
గౌడ, శెట్టిబలిజ: ఈ రెండు కులాల నుంచి 2014లో ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండేవారు. 2019 అసెంబ్లీలో మాత్రం వీరు ముగ్గురే ఉన్నారు.
యాదవులు: 2014లో ముగ్గురు గెలవగా 2019లో నలుగురు గెలిచారు.
వైశ్యులు: 2014లో ఇద్దరు ఉండేవారు ఇప్పుడు 2019 తరువాత వారి సంఖ్య నాలుగుకి పెరిగింది.
రాజులు: 2014లో అయిదుగురు ఎమ్మెల్యేలు ఉండగా 2019 తరువాత వారిసంఖ్య 4కి తగ్గింది.
మత్స్యకారులు: 2014, 2019 ఎన్నికల్లో ముగ్గురేసి చొప్పున గెలిచారు.
కాళింగ: 2014లో ఇద్దరు గెలిచారు. 2019లోనూ ఇద్దరు గెలిచారు.
బ్రాహ్మణులు: 2014లో ఒక్కరే గెలిచారు. 2019లో ఇద్దరు గెలిచారు.
కురుబ, బోయ: 2014లో ముగ్గరు.. 2019లో ముగ్గురు గెలిచారు.
బలిజ: 2014లో ఇద్దరు... 2019లో ఒక్కరు గెలిచారు.
లింగాయత్: 2014లో ఎవరూ గెలవలేదు.. 2019లో ఈ కులం నుంచి ఒకరు ఎమ్మెల్యేగా గెలిచారు.
గవర: 2014లో ఇద్దరుండేవారు.. 2019లో ఒక్కరు గెలిచారు.
రెడ్డిక: 2014లో ఎవరూ ఉండేవారు కాదు.. 2019లో ఒకరు గెలిచారు.
ముదిరాజ్: 2014లో ఎవరూ లేరు... 2019లో ఒకరు గెలిచారు.