జాతీయ పార్టీ కమలాన్ని ఏపీలో సైకిల్ తొక్కేస్తోంది. బీజేపీలోనే ఉంటూ అదే పార్టీని దెబ్బతీస్తున్నారు చంద్రబాబు కోవర్టులని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. స్వయంగా అడ్డంగా దొరికేశారు కూడా. ఏపీలో బలపడాలని అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీకి ఆ పార్టీలో చేరిన టీడీపీ నాయకులే ఎసరు పెడుతున్నారు. చంద్రబాబు డైరెక్షన్లో పనిచేస్తూ బీజేపీని చావుదెబ్బతీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేరుకు బీజేపీ నేతలు.. పనిచేసేది మాత్రం టీడీపీ కోసం. ఈ రాజకీయం అర్థం చేసుకోకపోతే.. మేల్కోకపోతే ఏపీపై బీజేపీ ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఏదో ఒకరోజు వస్తుందని నిజమైన బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.
ఏపీ బీజేపీలో ఏమీ అవుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. బీజేపీ ఏదో అనుకుంటే ఏదో జరిగిపోతోంది అని నిజమైన బీజేపీ వాళ్లు వాపోతున్నారు. హైటెక్ చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ వాళ్లు కార్పొరేట్ తరహాలో మమ్మలను వెనకకు నెట్టి అంతా వాళ్ల పెత్తనం సాగిస్తున్నారు అని రియల్ బీజేపీ వాళ్లు అనుకుంటున్నారు.. నిన్న జరిగిన సంఘటనలో సుజనా చౌదరి చేసిన పనికి బీజేపీకి చెడ్డ పేరు వస్తుందేమో అని బీజేపీలోని నాయకులు భయపడుతున్నారు. దీన్ని హైకమాండ్ కు తీసుకొని వెళ్లాలి అని బీజేపీ నాయకులు అనుకుంటున్నారు అని సోషల్ మీడియాలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.
హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్ లో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డతో బీజేపీ ఎంపీ సుజనా, మరో బీజేపీ నేత కామినేని శ్రీనివాస్ భేటి కావడం బీజేపీకి పెద్ద దెబ్బగా మారింది. ఇప్పటికే వారికి నోటీసులు ఇచ్చి సంజాయిషీ కోరినట్టు తెలిసింది. ఈ వ్యవహారంతో బీజేపీలోని నిజమైన నేతలకు చంద్రబాబు సన్నిహతుల లాబీయింగ్ ఎంత స్ట్రాంగో అర్థమైందట..
ఏపీలో బలపడాలని చూస్తున్న బీజేపీని ఇప్పుడు టీడీపీనే దెబ్బతీస్తోందని అర్థమవుతోంది. బీజేపీలోని చంద్రబాబు కోవర్టులు ఆ పార్టీలోనే ఉంటూ టీడీపీ కోసం పని చేస్తున్నారని తేటతెల్లమైంది. ఇలాంటి నేతలతో రాజకీయం చేస్తున్న బీజేపీ ఏపీలో ఎలా ఎదుగుతుందని వారు ప్రశ్నిస్తున్నారు. బీజేపీ ఏపీలో పుంజుకోకపోవడానికి ప్రధాన కారణం నాయకత్వ లోపమే శాపంగా మారిందంటున్నారు. సరైన నడిపించే నాయకుడు, దిశానిర్ధేశకుడు లేక బీజేపీ ఏపీలో నిలబడలేకపోతోంది. ఇప్పుడు కమ్మ నాయకుల చేతిలో మరోసారి బలిపశువు అవుతుందన్న చర్చ సాగుతోంది. బీజేపీ ఇలా కోవర్టులను తరిమికొట్టి అనాదిగా బీజేపీ వెంట ఉంటున్న కాపులు, బ్రాహ్మణులు, వైశ్యులను దరికి చేర్చుకొని వారికి పార్టీలో మంచి పదవులు ఇస్తే ఖచ్చితంగా బీజేపీ ఏపీలో నిలబడుతుందని అంటున్నారు. కానీ అవేవీ చేయకుండా కమ్మలనే నెత్తిన పెట్టుకుంటే బీజేపీని... టీడీపీ 2గా పిలుస్తారు తప్పితే సొంత గుర్తింపు అస్సలు దక్కదంటున్నారు.
ప్రస్తుతం ఏపీ బీజేపీ తీరు చూస్తుంటే రియల్ బీజేపీ వర్సెస్ టీడీపీ బీజేపీగా ఉందని.. సొంత పార్టీలోనే నేతలతో పోరాడాల్సి వస్తోందని అసలైన బీజేపీ నేతలు వాపోతున్నారట..