ఆంధ్రాకి ప్రత్యేక హోదా ఇస్తామని ఊరించిన కేంద్రం ప్యాకేజీతో సరిపెట్టే ప్రయత్నం చేస్తోంది. ప్రత్యేక హోదా గురించి గొప్పలు చెప్పిన భాజపా నేతలు ఇప్పుడు దాన్ని అందని ద్రాక్షగా చిత్రిస్తున్నారు. హోదా పులుపు... ప్యాకేజీ ముద్దు అంటున్నారు. ప్యాకేజీని అధికార పార్టీ తెలుగుదేశం స్వాగతించింది. వైకాపా వ్యతిరేకిస్తోంది. కాంగ్రెస్ ఉద్యమిస్తాం అంటోంది. కానీ, ఆంధ్రా భాజపా నేతలు మాత్రం సన్మానోత్సాహంతో ఉన్నారు! ప్యాకేజీ ప్రకటనలో కీలక పాత్ర పోషించారంటూ వెంకయ్య నాయుడిని మోసేస్తున్నారు. ఇప్పటి వరకూ రెండుసార్లు వెంకయ్యను సన్మానించి జయహో వెంకయ్యా... ఆంధ్రాను మేలు చేశావయ్యా అంటూ టముకేసుకుంటున్నారు! చిత్రం ఏంటంటే... ప్యాకేజీ ప్రకటించిన ఆర్థికమంత్రికి ఇంతవరకూ ప్రత్యేక సన్మానమైనా దక్కలేదు - ఒక్క శాలువా కూడా ఎవ్వరూ కప్పలేదు.
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన మర్నాడే ఆంధ్రా నుంచి భాజపా నేతలు బయలుదేరి ఢిల్లీ వెళ్లారు. భాజపా పెద్దల్ని అభినందించి వెంకయ్యను గౌరవంగా సన్మానించారు. మరి, ఆ సన్మానం వెంకయ్యకు సరిపోలేదో ఏమోగానీ శనివారం నాడు విజయవాడలో మరోసారి వెంకయ్యకు సన్మాన సభ ఏర్పాటు చేశారు! కేంద్రం ప్యాకేజీ ఇచ్చిన నేపథ్యంలో ఈ సన్మానం అంటూ పొగడ్తలతో ముంచేశారు. అయితే, ఇలా వరుస సన్మాలు చేయించుకుంటున్న వెంకయ్యనూ... చేస్తున్న భాజపా నేతల్ని చూస్తూ కొంతమంది రకరకాలుగా చర్చించుకుంటున్నారు.
ప్రత్యేక ప్యాకేజీలో ఏముందో ఆంధ్రా భాజపా నేతలకు తెలుసా అని ప్రశ్నిస్తున్నారు. ఆ ప్యాకేజీ ద్వారా ఆంధ్రాకి వచ్చే ప్రయోజనాలు ఏంటో ఏపీ భాజపా నేతలు వివరిస్తే బాగుంటుందని అంటున్నారు. అసలు ప్రశ్న ఏంటంటే... ప్యాకేజీ రూపకల్పనలో వెంకయ్య నాయుడు ప్రాధాన్యత ఏంటీ - ఆయన వల్ల ప్యాకేజీలో అదనంగా కూర్చబడిన లాభం ఏంటీ, ప్యాకేజీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీనిగానీ... ప్రకటించిన అరుణ్ జైట్లీనిగానీ సన్మానించకుండా వెంకయ్యకు మాత్రమే ఈ ప్రత్యేక గుర్తింపు ఏంటీ... ఈ ప్రశ్నలకు జవాబులు ఏపీ నేతలు జవాబు చెబితే బాగుండేదని పలువురి అభిప్రాయపడుతున్నారు. ‘ప్రత్యేక ప్యాకేజీ ప్యాకింగ్ వెనక వెంకయ్య పాత్ర ఇంతుందా’... అని ఆంధ్రులకు తెలిస్తే ఆయనకి ఎన్ని సన్మానాలు చేసినా - భుజకీర్తులు తొడిగినా చప్పట్లు కొడతారు. ఆ క్లారిటీ లేదు కాబట్టే... ఇదిగో ఇలా క్వశ్చన్ మార్కు ముఖాలతో వెంకయ్య సన్మాన సభలను చూస్తుంటారు!