యావత్ దేశంలోని పలు రాష్ట్రాల మీద ఫోకస్ చేసి.. అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్లాన్ చేసే బీజేపీ.. ఏపీని మాత్రం ఆరోవేలిగా చూస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. సరైన వ్యూహం లేకపోవటం.. ఒక్కోసారి ఒక్కో పార్టీతో జత కట్టటం మీద ఫోకస్ పెట్టినంతగా సొంత బలాన్ని పెంచుకోవటానికి ప్రత్యేక కార్యాచరణ లేనట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శ ఉంది. దీనికి తోడు.. ప్రత్యేక హోదా విషయంలో కానీ.. విశాఖకు ప్రత్యేక రైల్వే జోన్.. తాజాగా విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ లాంటి అంశాలతో.. రాష్ట్ర ప్రజల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత పెంచేలా ఉంది.
పార్టీ తీరు ఇలా ఉంటే.. ఏపీ బీజేపీకి సారథ్యం వహిస్తున్న సోము వీర్రాజు తీరు ఏ మాత్రం సరిగా లేదన్న అభిప్రాయం నెలకొంది. అధిష్ఠానం సైతం సోము తీరుపై అసంత్రప్తితో ఉన్నట్లుగా చెబుతున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సోమను తక్షణం పార్టీ అధ్యక్ష స్థానం నుంచి తొలగించి.. కొత్త అధ్యక్షుడ్ని ఎంపిక చేయటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సోము కంటే కూడా గతంలో ఏపీ పార్టీ అధ్యక్షుడిగా వ్యవహరించిన కన్నా లక్ష్మీనారాయణే సమర్థుడిగా పార్టీ గుర్తించినట్లు చెబతున్నారు. ఈ నేపథ్యంలో రానున్న మూడు నాలుగు రోజుల్లో సోముకు ఉద్వాసన ఖాయమన్న మాట వినిపిస్తోంది. కన్నాతో పాటు మరో ఇద్దరి పేర్లను పరిశీలించినప్పటికీ.. కన్నాను ఎంపిక చేయటం మీదనే ఎక్కువగా మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే.. చాలా త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వెలువడుతుందని చెబుతున్నారు.
అమరావతి ఉద్యమానికి కన్నా బాసటగా నిలిచారని.. న్యాయపోరాటం జరిగే వరకు రైతుల తరఫున పోరాటం చేస్తానని పలుమార్లు భరోసా ఇచ్చారని.. దీంతో బీజేపీ విషయంలో అమరావతి రైతులు కొంత సానుకూలత ప్రదర్శించినప్పటికి .. ఆ తర్వాత ఆ విషయాన్ని గట్టిగా ప్రస్తావించటం లేదన్న ఆరోపణ ఉంది. కన్నాకు బదులుగా తనను అధ్యక్షుడిగా నియమిస్తే.. పార్టీని మరింత బలోపేతం చేస్తానని చెప్పి.. ఒప్పించుకున్న ఆయన తీరా అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఆయన తీరు బాగోలేదన్న పెదవి విరుపు వినిపిస్తోంది.
అన్నింటికి మించి పార్టీలో పని చేసే వారిని పూర్తిగా అణిచివేశారన్న విమర్శను సోము వీర్రాజు ఎదుర్కొంటున్నారు. తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవటంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న పార్టీ.. అందుకు ప్రతిగా సోముపై వేటు వేయాలని నిర్ణయించినట్లుగా చెబుతున్నారు. తన స్థానంలో కన్నాను కానీ మరెవరికైనా కానీ పార్టీ పగ్గాలు ఇస్తారన్న సమాచారం అందుకున్న సోము.. అదే పనిగా ఢిల్లీకి వెళుతున్నారు. అయితే.. ఆయనకు వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసేందుకు ప్రయత్నం చేస్తుంటే.. ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వటానికి కూడా ఇష్టపడటం లేదని తెలుస్తోంది. దీంతో.. ఊసురుమంటూ తిరిగి వచ్చేసినట్లుగా చెబుతున్నారు. ఇప్పటి వరకు అందుతున్నసమాచారం ప్రకారం కన్నాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని.. ఏదైనా తేడా వస్తే మాత్రం మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డికి అవకాశం ఇవ్వొచ్చని చెబుతున్నారు. మరేం జరుగుతుందో చూడాలి.